ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO కొత్త ఏ-సిరీస్ ఫోన్ ని యూఏఈ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ కొత్త హ్యాండ్సెట్ OPPO A18 అనే పేరుతో వచ్చింది. ఎంట్రీ-లెవెల్ స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ OPPO A38 ని పోలి ఉన్నాయి. ఈ నెల ఆరంభంలో OPPO A38 పలు మార్కెట్లలో లాంచ్ అయ్యింది. సరే, ఓసారి OPPO A18 డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
OPPO A18 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO A18 లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 100 పర్సెంట్ డీసీఐ పీ3, 100 పర్సెంట్ ఎస్ఆర్జీబీ కలర్ గేముత్, వాటర్ డ్రాప్ నాచ్, 89 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో ఉన్నాయి.
- ప్రాసెసర్: OPPO A18 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ52 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
- మెమొరీ: OPPO A18 డివైజ్ లో 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 4జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.
- బ్యాటరీ: OPPO A18 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: OPPO A18 డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
- ఓఎస్: OPPO A18 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: OPPO A18 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
OPPO A18 ధర
OPPO A18 హ్యాండ్సెట్ ధరను యూఏఈ మార్కెట్ లో ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఒప్పో యూఏఈ అధికార వెబ్సైట్ లో డివైజ్ లిస్ట్ అయ్యింది.
OPPO A18 కలర్ ఆప్షన్స్
OPPO A18 స్మార్ట్ ఫోన్ గ్లోయింగ్ బ్లాక్ మరియు గ్లోయింగ్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
