
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు ఏ-సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. A1s, A1i పేర్లతో ఈ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 512జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్లలో ఉన్నాయి. సరే, ఓసారి ఈ డివైజెస్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
OPPO A1s, OPPO A1i ధరలు, కలర్ ఆప్షన్స్
ఒప్పో ఏ1ఎస్ డివైజ్ యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను RMB 1,199 (సుమారు రూ.13,800) గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధరను RMB 1,399 (సుమారు రూ.16,100) గా పెట్టారు.
OPPO A1s డస్క్ మౌంటెయిన్ పర్పుల్, నైట్ సీ బ్లాక్ మరియు టియాన్షుబీ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
OPPO A1i యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను RMB 1,099 (సుమారు రూ.12,700) గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర RMB 1,199 (సుమారు రూ.13,800) గా ఉంది.
OPPO A1i స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్ పర్పుల్ మరియు నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ రెండు ఫోన్లు చైనాలో ఏప్రిల్ 19వ తేదీన సేల్ కి వస్తాయి.
OPPO A1s స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: OPPO A1s లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 680 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.
బ్యాటరీ, చార్జింగ్: OPPO A1s లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది.
కనెక్టివిటీ: OPPO A1s లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
చిప్సెట్, స్టోరేజీ: OPPO A1s లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, మాలి జీ57 ఎంసీ2 జీపీయూ, 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి.
కెమెరా: OPPO A1s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బరువు, చుట్టుకొలత: OPPO A1s డివైజ్ 165.6 మి.మీ పొడవు, 76.0 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం, 193 గ్రాముల బరువు ఉంది.
OPPO A1i స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: OPPO A1i లో 6.56-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 89.8 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఉన్నాయి.
ప్రాసెసర్: OPPO A1i లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ ఉన్నాయి.
ర్యామ్, స్టోరేజీ: OPPO A1i డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: OPPO A1i లో 13ఎంపి మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: OPPO A1i లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: OPPO A1i లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.
బరువు, చుట్టుకొలత: OPPO A1i డివైజ్ 163.8 మి.మీ పొడవు, 75.1 మి.మీ వెడల్పు, 8.12 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంది.











