ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఒక కొత్త ఏ-సిరీస్ ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OPPO A3 Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ తాాజగా చైనా టెలీకామ్ లిస్టింగ్ పై దర్శనమిచ్చింది. దీంతో డివైజ్ యొక్క ధర మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఈ ఫోన్ మూడు మెమొరీ వేరియంట్స్ తో రానుందని తెలుస్తోంది. ఓసారి OPPO A3 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర వివరాలు తెలుసుకుందాం పదండి.
OPPO A3 Pro ధర (లీక్)
OPPO A3 Pro డివైజ్ చైనా టెలీకామ్ సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ధర, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. OPPO A3 Pro డివైజ్ మూడు వేరియంట్స్ లో లాంచ్ కానుందని మరొక సైట్ ద్వారా తెలుస్తోంది. చైనా టెలీకామ్ లిస్టింగ్ ప్రకారం, ఒప్పో ఏ3 ప్రో యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,999 యువాన్లుగా ఉంది. భారతీయ కరెన్సీలో దీన్ని రూ.23,000 అనుకోవచ్చు. టాప్ వేరియంట్ ధర రూ.28,000 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
OPPO A3 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
డిస్ప్లే: OPPO A3 Pro లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
ప్రాసెసర్: OPPO A3 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
ర్యామ్, స్టోరేజీ: OPPO A3 Pro డివైజ్ మూడు మెమొరీ వేరియంట్స్ లో చైనాలో లాంచ్ అవుతుంది. లిస్టింగ్ ప్రకారం, 8జిబి+256జిబి, 12జిబి+256జిబి మరియు 12జిబి+512జిబి స్టోరేజీ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.
కెమెరా: OPPO A3 Pro డివైజ్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: OPPO A3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: OPPO A3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది.
కనెక్టివిటీ: OPPO A3 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.
