లాంచ్‌కి ముందు లీకైన OPPO A38 స్పెసిఫికేషన్స్, ధర

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO A38
  • తాజాగా లీకైన స్పెసిఫికేషన్స్, ధర
  • హీలియో జీ80 చిప్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO A38 అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ధర వివరాలు లీక్ అయ్యాయి. త్వరలోనే OPPO A38 డివైజ్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. తక్కువ ధరలోనే ఈ ఫోన ని తీసుకొస్తారని తెలుస్తోంది. సరే, ఓసారి OPPO A38 స్మార్ట్ ఫోన్ లీకైన స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO A38 రెండర్స్ (లీక్)

  • OPPO A38 యొక్క లాంచ్ తేదీ లేదా ఇతర వివరాలను ఒప్పో ఇంకా అధికారికంగా రివీల్ చేయలేదు. కానీ, రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్ Appuals ద్వారా రివీల్ అయ్యాయి.
  • OPPO A38 స్మార్ట్ ఫోన్ బ్లాక్ మరియు గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో లభించనున్నట్లు ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది.
  • OPPO A38 లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ ప్యానెల్ పై ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఇచ్చారు.
  • OPPO A38 ఫ్రంట్ సైడ్ చూస్తే, వాటర్ డ్రాప్ నాచ్ కనిపిస్తోంది. ఇందులో సెల్ఫీ కెమెరా ఉంది.
  • OPPO A38 కి కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. ఇక బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో ఒప్పో బ్రాండింగ్ ఉంది.

OPPO A38 స్పెసిఫికేషన్స్ (లీక్)

  • డిస్ప్లే: OPPO A38 లో 6.56-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: OPPO A38 లో మీడియాటెక్ హీలియో జీ80 చిప్ ఉంటుంది.
  • స్టోరేజీ: OPPO A38 లో 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఉంటాయి.
  • కెమెరా: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • ఓఎస్: OPPO A38 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A38 స్మార్ట్ ఫోన్ లో ఐపీ54 రేటింగ్, 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.3, వై-ఫై, మైక్రోఎస్డీ కార్డ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

OPPO A38 ధర (లీక్)

OPPO A38 స్మార్ట్ ఫోన్ యూరప్ మార్కెట్ లో లాంచ్ అవ్వనుంది. అక్కడ ధరను 159 యూరోలు (సుమారు రూ.14,200) గా నిర్ణయించారు. భారత్ లో OPPO A38 ధర రూ.12,000 నుంచి రూ.15,000 మధ్య ఉంటుంది. మరోవైపు, లాంచ్ టైమ్‌లైన్ గురించి మాట్లాడితే, వచ్చే నెలలో యూరోపియన్ మార్కెట్ లో లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో కూడా లాంచ్ అవ్వనుంది.