OPPO A3x 4G: రూ.8,999 ధరతో భారత్‌లో లాంచైన ఒప్పో ఏ3ఎక్స్ 4జీ

Highlights

  • భారత్‌లో OPPO A3x 4G విడుదల
  • ప్రారంభ ధర రూ.8,999
  • 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO గత నెలలో ఒప్పో ఏ3ఎక్స్ 5జీ ఫోన్ లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ సంస్థ 4జీ డివైజ్ OPPO A3x 4G ని లాంచ్ చేసింది. దీని ధర కేవలం రూ.8,999. ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 1 చిప్సెట్, 8ఎంపి మెయిన్ కెమెరా, 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO A3x 4G ధర, కలర్స్

OPPO A3x 4G స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధర ఎంతో తెలుసుకుందాం. 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 గా ఉంది. OPPO A3x 4G స్మార్ట్‌ఫోన్‌ నెబులా రెడ్ మరియు ఓషన్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది. రూ.399 అదనంగా చెల్లించి స్క్రీన్ ప్రొటెక్షన్ లేదా ఎక్స్‌టెండెడ్ వ్యారంటీ పొందవచ్చు.

OPPO A3x 4G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO A3x 4G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 1604*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్: OPPO A3x 4G డివైజ్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ 4జీ జెన్ 1 ఆక్టా-కోర్ ప్రాసెసర్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.8 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ ఇచ్చారు.

సాఫ్ట్‌వేర్: OPPO A3x 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

మెమొరీ: OPPO A3x 4G డివైజ్4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో 4జిబి వరకు ర్యామ్ పవర్ పెంచుకోవచ్చు. అంటే యూజర్‌కి గరిష్టంగా 8జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: OPPO A3x 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 8ఎంపి మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: OPPO A3x 4G లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO A3x 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.