ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. OPPO A3x 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ చైనాకు చెందిన చైనా టెలీకామ్ వెబ్‌సైట్‌పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం రివీల్ అయ్యింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.
OPPO A3x 5G చైనా టెలీకామ్ లిస్టింగ్
OPPO A3x 5G స్మార్ట్‌ఫోన్ చైనా టెలీకామ్ సైట్ పై PKD130 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ లో డివైజ్ పేరు OPPO A3x 5G అని ఉంది.
లిస్టింగ్ ప్రకారం, OPPO A3x 5G డివైజ్ ప్లాస్టిక్ మెటీరియల్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ఓవల్ షేప్డ్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో డ్యూయల్ కెమెరాలు, రింగ్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.
OPPO A3x 5G స్మార్ట్‌ఫోన్ పంచ్ హోల్ కటౌట్ ఫ్రంట్ ప్యానెల్ పై కనిపిస్తుంది. ఇందులో సెల్ఫీ కెమెరా ఉంటుంది.
చైనాలో OPPO A3x 5G డివైజ్ స్టార్‌లైట్ వైట్, డార్క్ నైట్ పర్పుల్ మరియు క్లౌడ్ ఫెదర్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభించే అవకాశం ఉంది.
OPPO A3x 5G డివైజ్ డైమెన్షన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ 165.79 మి.మీ పొడవు, 76.14 మి.మీ వెడల్పు, 7.68 మి.మీ మందం, 185.7 గ్రాముల బరువు ఉంటుంది.
OPPO A3x 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: OPPO A3x 5G డివైజ్ 6.67-ఇంచ్ ఎల్సీడీ హెచ్డీ+ స్క్రీన్, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంటుందని చైనా టెలీకామ్ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
ర్యామ్, స్టోరేజీ: OPPO A3x 5G డివైజ్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: OPPO A3x 5G స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 32ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో/డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ: OPPO A3x 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
ఇతర ఫీచర్లు: OPPO A3x 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, లైట్ సెన్సర్, గ్రావిటీ సెన్సర్, ఆల్టిట్యూడ్ సెన్సర్, డిస్టన్స్ సెన్సర్ మరియు డైరెక్షన్ సెన్సర్ ఉంటాయి.
