
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో OPPO A59 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ తో వచ్చింది. తక్కువ బడ్జెట్ లో లభించే ఈ ఫోన్ స్టైలిష్ లుక్ తో పాటు చక్కటి స్పెసిఫికేషన్స్ కలిగి ఉంది. సరే, ఓసారి OPPO A59 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ధర, సేల్, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
OPPO A59 5G ధర, సేల్, కలర్ ఆప్షన్స్
- OPPO A59 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో రెండు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది.
- OPPO A59 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.14,999 గా నిర్ణయించారు.
- OPPO A59 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ఈ వేరియంట్ ధరను కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది.
- OPPO A59 5G స్మార్ట్‌ఫోన్ సిల్క్ గోల్డ్ మరియు స్టారీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- OPPO A59 5G డివైజ్ ని ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ మరియు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
OPPO A59 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO A59 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ బ్రైట్నెస్, 96 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ కలర్ గేముత్ ఉన్నాయి.
- ప్రాసెసర్: OPPO A59 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు. ఈ ఆక్టాకోర్ చిప్ 7 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ57 జీపీయూ అందించారు.
- ర్యామ్, స్టోరేజీ: OPPO A59 5G లో 4జిబి ర్యామ్/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. యూజర్ కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
- కెమెరా: OPPO A59 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ: OPPO A59 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. ఇది ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: OPPO A59 5G డివైజ్ 7 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.











