నేడు భారత్‌లో Oppo A59 5G ఫస్ట్ సేల్; లాంచ్ ఆఫర్స్ తెలుసుకోండి!

Highlights

  • నేడే భారత్ లో Oppo A59 5G సేల్
  • డైమెన్సిటీ 6020 చిప్‌తో వచ్చిన డివైజ్
  • Oppo A59 5G ప్రారంభ ధర రూ.14,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo ఇటీవలె Oppo A59 5G డివైజ్ ని లాంచ్ చేసింది. నేటి నుంచి భారత్ లో Oppo A59 5G ఫోన్ సేల్ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో స్టోర్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ ప్యానెల్, 580 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది. సరే, ఓసారి Oppo A59 5G సేల్ వివరాలు, లాంచ్ ఆఫర్స్, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Oppo A59 5G ధర, లాంచ్ ఆఫర్లు, లభ్యత

  • Oppo A59 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.14,999 గా నిర్ణయించారు.
  • Oppo A59 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంది.
  • ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో స్టోర్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా Oppo A59 5G ని కొనుగోలు చేయవచ్చు.
  • ఎస్బీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, ఏయూ ఫైనాన్స్ బ్యాంక్ మరియు వన్‌కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై ఒప్పో రూ1,500 డిస్కౌంట్ మరియు 6 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐని ఆఫర్ చేస్తోంది.

Oppo A59 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A59 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ బ్రైట్నెస్, 96 పర్సెంట్ ఎన్టీఎస్‌సీ కలర్ గేముత్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: OPPO A59 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు. ఈ ఆక్టాకోర్ చిప్ 7 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ57 జీపీయూ అందించారు.
  • ర్యామ్, స్టోరేజీ: OPPO A59 5G లో 4జిబి ర్యామ్/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 6జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. యూజర్ కి గరిష్టంగా 12జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: OPPO A59 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
  • బ్యాటరీ: OPPO A59 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. ఇది ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A59 5G డివైజ్ 7 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.
Previous articleలాంచ్‌కి ముందు లీకైన OnePlus Ace 3V చిప్సెట్, డిస్ప్లే స్పెసిఫికేషన్స్
Next articleSnapdragon 6 Gen 1 చిప్‌తో చైనాలో లాంచైన Vivo Y100i Power
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.