హైలైట్స్:
- నేడు భారత మార్కెట్ లో లాంచ్ అయిన OPPO A77s
- 50ఎంపి కెమెరా, 8జిబి ర్యామ్, స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్లు
- భారత్ లో OPPO A77s ధర రూ.17,999
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ OPPO నేడు భారత్ లో OPPO A77s స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. 50 మెగా పిక్సెల్ కెమెరా, 8జిబి ర్యామ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. భారత్ లో ఈ ఫోన్ ధరను రూ.17,999 గా నిర్ణయించారు. OPPO A77s కి సంబంధించిన ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం పదండి.
OPPO A77s ధర
OPPO A77s కేవలం సింగిల్ వేరియంట్ లో భారత గడ్డపై అడుగు పెట్టింది. ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తోంది. OPPO A77s ధర రూ.17,999 గా ఉంది. సన్సెట్ ఆరెంజ్, స్టారీ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. OPPO A77s ఫోన్ పై 10 శాతం క్యాష్ బ్యాక్ బ్యాంక్ ఆఫర్ లభిస్తుంది. అలాగే 6 నెలల కాలపరిమితి తో నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా OPPO A77s ని కొనుగోలు చేయవచ్చు.
OPPO A77s స్పెసిఫికేషన్స్
OPPO A77s స్మార్ట్ ఫోన్ 6.56-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఇది 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంది. ఎల్సీడీ ప్యానెల్ ని ఇందులో అందించారు. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ బ్రైట్నెస్ ఈ ఫోన్లో ఉన్నాయి. వాటర్ డ్రాప్ నాచ్, మూడు వైపుల బెజెల్-లెస్ డిజైన్, బాటమ్ లో సన్నని చిన్ ఉన్నాయి.
OPPO A77s ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 12.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ అమర్చారు. ఇది 2.4 గిగా హెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. OPPO A77s లో 8జిబి ర్యామ్, 5జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. రెండు కలిపి OPPO A77s 13జిబి ర్యామ్ పై ఎంతో శక్తివంతంగా పని చేస్తుంది. ఇక 128జిబి స్టోరేజీని ఇందులో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇప్పుడు OPPO A77s యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. OPPO A77s లో 50 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్, 2 మెగా పిక్సెల్ మోనో లెన్స్ లతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్లో ముందు వైపున 8 మెగా పిక్సెల్ కెమెరా అమర్చారు.
OPPO A77s ఒక డ్యూయల్ సిమ్ ఫోన్. 4జీ ఎల్టీఈ పై పని చేస్తుంది. ఈ ఫోన్లో 3.5 ఎంఎం ఆడియో జాక్, ఇతర బేసిక్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇకపోతే ఫోన్ భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు. OPPO A77s లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.