Home News రూ.17,499 ధరతో రానున్న OPPO A78 4G; డివైజ్‌ని టీజ్ చేసిన కంపెనీ!

రూ.17,499 ధరతో రానున్న OPPO A78 4G; డివైజ్‌ని టీజ్ చేసిన కంపెనీ!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న OPPO A78 4G
  • ఇప్పటికే చైనాలో లాంచైన డివైజ్
  • ఆగస్టు 15 లోపు భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో కొన్ని రోజుల క్రితం ఇండోనేషియాలో OPPO A78 4G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్ తో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరా, 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. త్వరలోనే ఈ మిడ్-రేంజ్ ఒప్పో ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ఎంటర్ కానుంది. తాజాగా కంపెనీ OPPO A78 డివైజ్ ఇండియా లాంచ్ ని అధికారికంగా టీజ్ చేసింది.

OPPO A78 4G ఇండియా లాంచ్ వివరాలు

తన అధికార ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒప్పో సంస్థ OPPO A78 డివైజ్ ని టీజ్ చేసింది. కమింగ్ సూన్ అని రాసి OPPO A78 ఫోన్ పిక్ ని షేర్ చేసింది. అయితే లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. కానీ, ఆగస్టు 15 లోపే భారతీయ మార్కెట్ లో OPPO A78 డివైజ్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

భారత్ లో OPPO A78 4G ధర

భారత్ లో OPPO A78 రూ.17,499 ధరకి లభించనుందని రిటైల్ వర్గాల ద్వారా 91మొబైల్స్ కి సమాచారం అందింది. గతంలో లాంచైన OPPO F21s Pro 4G ని OPPO A78 డివైజ్ రిప్లేస్ చేయనుంది. కంపెనీ స్వయంగా OPPO F21s Pro 4G స్టాక్స్ ని ఖాళీ చేయాలని రిటైలర్స్ కి చెబుతున్నట్లు తెలిసింది.

OPPO A78 4G స్పెసిఫికేషన్స్ (గ్లోబల్)