67W ఫాస్ట్ చార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌తో భారత్‌లో లాంచైన OPPO A78 4G

Highlights

  • 8జిబి + 128జిబి స్టోరేజీ వేరియంట్‌లో వచ్చిన OPPO A78 4G
  • రెండు కలర్ ఆప్షన్స్ తో లాంచైన డివైజ్
  • OPPO A78 4G ధర రూ.17,499

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో కొన్ని రోజుల క్రితం OPPO A78 5G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేసింది. అయితే తాజాగా ఈ సంస్థ OPPO A78 4G డివైజ్ ని భారతీయ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ లో 6.43-ఇంచ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. సరే, ఓసారి OPPO A78 4G డివైజ్ ధర, సేల్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్స్ ని తెలుసుకుందాం పదండి.

భారత్ లో OPPO A78 4G ధర, లభ్యత

  • OPPO A78 4G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.17,499 గా నిర్ణయించారు.
  • ఈ స్మార్ట్ ఫోన్ ని భారత్ లో ఒప్పో అధికార వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
  • రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా ఫోన్ ని కొనుగోలు చేస్తే, 10 శాతం డిస్కౌంట్ (రూ.1,500) వరకు లభిస్తుంది. ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, వన్‌కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై 3 నెలల కాల పరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కలదు.
  • ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేస్తే ఫోన్ పై రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది.
  • OPPO A78 4G డివైజ్ ఆక్వా గ్రీన్ మరియు మిస్ట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO A78 4G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A78 4G డివైజ్ లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • రియర్ కెమెరా: OPPO A78 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి.
  • సెల్ఫీ కెమెరా: OPPO A78 4G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • చిప్సెట్: OPPO A78 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ అందించారు. ఇందులో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ వినియోగించారు.
  • స్టోరేజీ: OPPO A78 4G డివైజ్ లో 8జిబి ఫిజికల్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: OPPO A78 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: OPPO A78 4G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: OPPO A78 4G డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.