OPPO A78 ధర తగ్గింపు; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights

  • ఇటీవలె భారత్‌లో లాంచైన OPPO A78
  • 6.43-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్‌తో వచ్చిన ఫోన్
  • OPPO A78 డివైజ్ లాంచ్ ధర రూ.17,499

ప్రముఖ టెక్ బ్రాండ్ OPPO కొన్ని నెలల క్రితం భారతీయ మార్కెట్ లో OPPO A78 డివైజ్ ని లాంచ్ చేసింది. రూ.17,499 ధరతో OPPO A78 ఫోన్ లాంచ్ అయ్యింది. అయితే తాజాగా ఒప్పో సంస్థ యూజర్లకు పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. OPPO A78 డివైజ్ ధరను తగ్గించింది. 16జిబి ర్యామ్, 50ఎంపి మెయిన్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చిన OPPO A78 డివైజ్ ధర తగ్గింపు వివరాలు తెలుసుకుందాం.

OPPO A78 ధర తగ్గింపు

  • ఒప్పో సంస్థ OPPO A78 డివైజ్ ని రూ.17,499 ధరతో లాంచ్ చేసింది.
  • ప్రస్తుతం OPPO A78 ఫోన్ ధరను రూ.1,000 తగ్గించింది.
  • ధర తగ్గింపుతో OPPO A78 డివైజ్ రూ.16,499 కే లభించనుంది.
  • దీంతో పాటు బ్యాంక్ ఆఫర్ కూడా కలిస్తే, మరింత తక్కువ రేటుకే ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు.
  • OPPO A78 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ లో లభిస్తుంది.
  • OPPO A78 స్మార్ట్‌ఫోన్ మిస్ట్ బ్లాక్ మరియు ఆక్వా గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO A78 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: OPPO A78 4G డివైజ్ లో 6.4-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • రియర్ కెమెరా: OPPO A78 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి.
  • సెల్ఫీ కెమెరా: OPPO A78 4G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • చిప్సెట్: OPPO A78 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్ అందించారు. ఇందులో గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 610 జీపీయూ వినియోగించారు.
  • మెమొరీ: OPPO A78 4G డివైజ్ లో 8జిబి ఫిజికల్ ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
  • ఓఎస్: OPPO A78 4G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: OPPO A78 4G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: OPPO A78 4G లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: OPPO A78 4G డివైజ్ లో ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.
Previous article1.5K అమోలెడ్ స్క్రీన్‌తో వస్తోన్న OnePlus Nord 4
Next articleTKDN సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌పై కనిపించిన Vivo Y27s
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.