
ఒప్పో కంపెనీ త్వరలో OPPO A78 4G డివైజ్ ని భారత్ లో లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ ధర రూ.18,999 గా ఉంది. ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు, తాజాగా OPPO A78 4G డివైజ్ కి సంబంధించిన లాంచ్ వివరాలను వెల్లడించారు. సరే, ఓసారి OPPO A78 4G స్మార్ట్ ఫోన్ రెండర్ ఇమేజ్, స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.
OPPO A78 4G డిజైన్ (లీక్)
- ఫ్రంట్ ప్యానెల్: డిజైన్ విషయానికి వస్తే, OPPO A78 4G స్మార్ట్ ఫోన్ చూడటానికి OPPO A78 5G మాదిరే ఉంటుంది. OPPO A78 4G లో ఫ్లాట్ అమోలెడ్ స్క్రీన్, సెల్ఫీ కెమెరా కోసం లెఫ్ట్ సైడ్ లో పంచ్ హోల్ కటౌట్, మూడు వైపులా సన్నని బెజెల్స్, బాటమ్ లో మందపాటి చిన్ ఉంటాయి.
- బ్యాక్ ప్యానెల్: OPPO A78 4G లో మెటల్ బాడీ డిజైన్ ని వాడారు. ఈ ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. బ్యాక్ ప్యానెల్ పాలిష్డ్ ప్యాటర్న్ ని కలిగి ఉంది. కెమెరా సెన్సర్స్ కోసం రెండు రింగ్స్ ఇచ్చారు. అలాగే ఒక ఫ్లాష్ కూడా ఉంది. బాటమ్ లో ఒప్పో బ్రాండింగ్ ఉంది.
- సైడ్ ప్యానెల్: OPPO A78 4G ఫోన్ ఎడమవైపున వాల్యూమ్ బటన్ ఉంది. కుడివైపున పవర్ బటన్ ఉంది. పవర్ బటన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎంబెడ్ చేయబడి ఉంది. ఫోన్ బాటమ్ లో టైప్-సీ పోర్ట్ ఉంది. ఇంకా 3.5 ఎంఎం ఆడియో జాక్, స్పీకర్ ఉన్నాయి.
OPPO A78 4G స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: OPPO A78 4G స్మార్ట్ ఫోన్ లో 6.43-ఇంచ్ ఫ్లాట్ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటాయి.
- ప్రాసెసర్: OPPO A78 4G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుందని సమాచారం.
- మెమొరీ: OPPO A78 4G లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉంటాయని తెలుస్తోంది.
- కెమెరా: OPPO A78 4G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: OPPO A78 4G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
- చార్జింగ్: OPPO A78 4G స్మార్ట్ ఫోన్ 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది.
- ఇతర ఫీచర్లు: OPPO A78 4G స్మార్ట్ ఫోన్ లో ఐపీ54 రేటింగ్, వై-ఫై 5, యూఎస్బీ టైప్-సీ, బ్లూటూత్ 5.0 ఉన్నాయి.











