Oppo A78 5G ఇప్పటికే భారతీయ మార్కెట్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వచ్చింది. దాదాపు $230 ధరతో ఈ ఫోన్ మార్కెట్ లో లభిస్తోంది. అయితే, Oppo కొత్త 4G వెర్షన్ డివైజ్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా Oppo A78 4G స్మార్ట్ ఫోన్ IMDA వెబ్ సైట్ పై కనిపించిందని Gizmochina ఒక కథనాన్ని రాసింది. దీంతో Oppo A78 4G త్వరలోనే లాంచ్ కానుందని తెలిసిపోయింది.
Oppo A78 4G IMDA సర్టిఫికేషన్ వివరాలు
Oppo A78 4G వేరియంట్ మోడల్ నంబర్ CPH2565 తో IMDA సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. జాబితా ప్రత్యేకంగా ఆసక్తికరమైన విషయాలను ఏమీ వెల్లడించలేదు. ఇది WCDMA, LTE, బ్లూటూత్, Wi-Fi, NFC మరియు GPS వంటి వివరాలను రివీల్ చేసింది. ఈ వివరాలు కాకుండా, ఈ రాబోయే డివైజ్ గురించి మరేమీ వెల్లడించలేదు.
డివైజ్ పేరులో ఉన్న 4G, ఇది Oppo A78 5G కంటే తక్కువ ధరను కలిగి ఉంటుందని తెలియజేస్తోంది. ఇది అమెజాన్ ఇండియాలో రూ.18,999 ($230) ధరతో లాంచ్ అనంతరం లభ్యమవ్వనుంది. ఈ ఫోన్ లో వాడబడిన ప్రాసెసర్, తదితర వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే ఈ సమాచారం తెలిసే అవకాశం ఉంది. ఒప్పో నుంచి ఈ ఫోన్ కి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం.
OPPO A78 5G స్పెసిఫికేషన్స్
ఇప్పుడు ఒకసారి Oppo A78 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- డిస్ప్లే: Oppo A78 5G లో 90Hz రిఫ్రెష్ రేట్, 6.56-అంగుళాల LCD HD+ డిస్ప్లే ఉన్నాయి.
- చిప్సెట్: Oppo A78 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడారు. ఇది 5జీ ప్రాసెసర్.
- ర్యామ్: Oppo A78 5G లో 8GB LPDDR4x RAM అందించారు.
- ఫ్రంట్ కెమెరా: Oppo A78 5G డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- రియర్ కెమెరా: Oppo A78 5G లో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ షూటర్ ఉన్నాయి. వీటికి తోడు ఒక LED ఫ్లాష్ ఉంది.
- బ్యాటరీ, చార్జింగ్ స్పీడ్: Oppo A78 5G డివైజ్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చింది. పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5,000mAh బ్యాటరీని అందించారు.
- ఓఎస్: Oppo A78 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ColorOS 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ 188 గ్రాముల బరువు, 7.99mm మందం ఉంటుంది.
