Home News జనవరి 14 న భారత్‌లో లాంచ్ అవుతోన్న OPPO A78 5G

జనవరి 14 న భారత్‌లో లాంచ్ అవుతోన్న OPPO A78 5G

హైలైట్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో త్వరలో భారత్ లో ఒక ఏ-సిరీస్ ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. ఈ కంపెనీ నుంచి ఏ-సిరీస్ లో వివిధ బడ్జెట్ రేంజెస్ లో ఫోన్లు రానున్నట్లు సమాచారం. ఇక త్వరలో లాంచ్ కాబోయే OPPO A78 5G స్మార్ట్ ఫోన్ OPPO A77 మరియు OPPO A77s కి సక్సెసర్ గా వస్తోంది.

అయితే OPPO A78 5G లాంచ్ కి సబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా కంపెనీ నుంచి రావాల్సి ఉంది. Appauls నుంచి వచ్చిన కొత్త లీక్ ని బట్టి, OPPO A78 5G భారత్ లో జనవరిలో లాంచ్ అవుతోంది. ఈ రిపోర్ట్ ద్వారా ఫోన్ యొక్క లాంచ్ తేదీ, ధర వివరాలు కూడా తెలిసాయి.

OPPO A78 5G ఇండియా లాంచ్ టైమ్ లైన్, స్పెసిఫికేషన్స్, ధర

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో త్వరలోనే లాంచ్ కాబోతోంది. ఈ ఫోన్ ధరను ఒప్పో రూ.20,000 లోపు పెట్టే అవకాశం ఉంది. అపాల్స్ రిపోర్ట్ ప్రకారం, OPPO A78 5G బేస్ వేరియంట్ ధర భారత్ లో రూ.19,000 గా ఉండనుందని సమాచారం. రిపోర్ట్ ప్రకారం ఈ ఫోన్ CPH2495 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ లోని అబౌట్ సెక్షన్ స్క్రీన్ షాట్ గా పరిగణించబడుతోన్న పిక్ ద్వారా ఈ ఫోన్ 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. ఇకపోతే ఈ ఫోన్ 4జిబి వరకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వస్తోంది. ఇంకా 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందిస్తున్నారు.

ప్రముఖ టిప్ స్టర్ సుదాన్శు చెబుతున్నదాన్ని బట్టి, OPPO A78 5G ఫోన్ డైమెన్సిటీ 700 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. ఇది 7ఎన్ఎం ప్రాసెస్ పై తయారైన చిప్. ఇప్పుడు ఎంట్రీ లెవెల్ 5జీ చిప్సెట్ గా దీన్ని చాలా ఫోన్లలో వాడుతున్నారు. గ్రాఫిక్స్ కోసం ఇందులో మాలి జీ57 జీపీయూ వాడారు.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OPPO A78 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

OPPO A78 5G లో 6.6-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి. ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో జనవరి 14 న లాంచ్ అవుతోందని సమాచారం. అందుబాటులోకి వచ్చాక, మీకు మరింత సమాచారం అందిస్తాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.