లీకైన OPPO A78 5G ఇండియా లాంచ్ తేదీ, కలర్ ఆప్షన్స్

హైలైట్స్

  • రీసెంట్ గా మలేషియాలో లాంచైన OPPO A78 5G స్మార్ట్ ఫోన్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్, 8జిబి ర్యామ్ + 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన ఫోన్
  • భారత్ లో OPPO A78 5G ధర రూ.18,999 గా ఉండే అవకాశం

ఒప్పో సంస్థ రీసెంట్ గా OPPO A78 5G అనే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ని మలేషియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ ని భారత్ లో లాంచ్ చేసేందుకు ఒప్పో సిద్ధమవుతోంది. అయితే ఒప్పో ఇంకా దీనికి సంబంధించి అధికార ప్రకటన చేయాల్సి ఉంది. ఈలోపు, 91Mobiles Hindi వెబ్‌సైట్ OPPO A78 5G యొక్క లాంచ్ వివరాలను రివీల్ చేసింది. జనవరి 16 న భారత్ లో ఈ డివైజ్ లాంచ్ కానుందని సమాచారం. గ్లోయింగ్ బ్లూ, గ్లోయింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

ఆ రిపోర్ట్ ప్రకారం OPPO A78 5G సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ తో వస్తోంది. ఓసారి OPPO A78 5G యొక్క భారత మార్కెట్ ధర, స్పెసిఫికేషన్స్ మరియు ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో ఒప్పో ఏ78 5జీ ధర (లీక్డ్)

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ జనవరి 16 న భారత్ లో లాంచ్ అవుతుందని సమాచారం. సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో వస్తోన్న ఈ ఫోన్ 8జిబి ర్యామ్ ని ఆఫర్ చేస్తుంది. ఇకపోతే ఈ ఫోన్ 128జిబి స్టోరేజీని కలిగి ఉంటుంది. అలాగే 8జిబి ర్యామ్ కి తోడు, 8జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. దీంతో మొత్తం ర్యామ్ 16జిబి వరకు యూజర్ కి లభిస్తుంది.

రిపోర్ట్స్ ని బట్టి OPPO A78 5G స్మార్ట్ ఫోన్ ధర భారత్ లో రూ.18,999 గా ఉంటుందని తెలుస్తోంది. గ్లోయింగ్ బ్లూ, గ్లోయింగ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. త్వరలోనే ఈ డివైజ్ భారత్ లో సేల్ కి అందుబాటులోకి వస్తుంది. జనవరి 18 నుంచి ఈ డివైజ్ సేల్ కి వచ్చే అవకాశం ఉంది.

ఒప్పో ఏ78 5జీ స్పెసిఫికేషన్స్

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ 6.54-ఇంచ్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లే, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్ తో వస్తోంది. ఈ ఫోన్ ధర రూ.18,999 గా ఉండవచ్చని తెలుస్తోంది. అయితే ఈ ధరకు హెచ్డీ+ రెజుల్యూషన్ కలిగిన డిస్ప్లేని ఇవ్వడం బాగాలేదు. ఈ ధరల శ్రేణిలో లభిస్తోన్న ఫోన్లు ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంటే.. OPPO A78 5G మాత్రం 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీ+ డిస్ప్లే తో వస్తుండటం విచిత్రంగా ఉంది.

OPPO A78 5G ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ తో వస్తోంది. బ్యాక్ ప్యానెల్ పై రెండు భారీ సర్క్యులర్ కటౌట్స్ ఉంటాయి. వీటిలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

OPPO A78 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్సెట్ వాడారు. 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. OPPO A78 5G ఫోన్ 7.99 మిల్లీ మీటర్ల మందం, 188 గ్రాముల బరువు ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleఅదిరిపోయే ఫీచర్లతో వస్తోన్న LML Star ఎలక్ట్రిక్ స్కూటర్
Next articleభారత్‌లో మొదలైన Samsung Galaxy S23 సిరీస్ ప్రీ-బుకింగ్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.