ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. OPPO A80 5G పేరుతో ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు డిజైన్ రివీల్ అయ్యాయి. ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉన్న OPPO A3 Vitality ఎడిషన్ కి OPPO A80 5G రీబ్రాండ్ వర్షన్ గా రానుందని సమాచారం. ఇకపోతే ఒప్పో ఏ80 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో వస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
OPPO A80 5G ధర (గ్లోబల్)
OPPO A80 5G స్మార్ట్‌ఫోన్ యూరోపియన్ మార్కెట్ ధర వివరాలు ప్రముఖ టిప్‌స్టర్ సుదాన్శు ద్వారా తెలిసాయి. 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 249 యూరోలు (సుమారు రూ.22,566) గా ఉంటుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
OPPO A80 5G డిజైన్, కలర్స్
OPPO A80 5G డివైజ్ పంచ్-హోల్ కటౌట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ఎల్ఈడీ రింగ్ లైట్ తో వస్తున్నట్లు రివీలైన ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది. ఈ ఫోన్ బ్లాక్, పర్పుల్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవ్వనుంది.
OPPO A80 5G స్పెసిఫికేషన్స్
OPPO A80 5G డివైజ్ లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటాయి.
OPPO A80 5G లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, ఐపీ54 రేటింగ్, 300% అల్ట్రా వాల్యూమ్ మోడ్, ఎన్ఎఫ్‌సీ, వై-ఫై 5, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉంటాయి.
