Home News OPPO A80 5G: 5100mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన ఏ80 5జీ

OPPO A80 5G: 5100mAh బ్యాటరీతో గ్లోబల్‌గా లాంచైన ఏ80 5జీ

Highlights
  • నెదర్లాండ్స్‌లో OPPO A80 5G లాంచ్
  • 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తాజాగా గ్లోబల్‌ మార్కెట్ లో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO A80 5G పేరుతో ఈ ఫోన్ నెదర్లాండ్స్ లో విడుదలైంది. తక్కువ బడ్జెట్ లో లభించనున్న ఒప్పో ఏ80 5జీ ఫోన్ లో 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO A80 5G ధర

OPPO A80 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను 299 యూరోలు (సుమారు రూ.25,000) గా పెట్టారు.

ఒప్పో ఏ80 5జీ స్మార్ట్‌ఫోన్ స్టారీ బ్లాక్ మరియు పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఒప్పో నెదర్లాండ్స్ వెబ్‌సైట్ మరియు ఆ దేశంలోని ఇతర ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

OPPO A80 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO A80 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, పంచ్ హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO A80 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు.

మెమొరీ: OPPO A80 5G డివైజ్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది.

కెమెరా: OPPO A80 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్: OPPO A80 5G లో పవర్ బ్యాకప్ కోసం 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: OPPO A80 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO A80 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, 360 డిగ్రీ ఆర్మర్ రోబస్ట్ బాడీ ఉన్నాయి.

బరువు, చుట్టుకొలత: OPPO A80 5G డివైజ్ 165.79 మి.మీ పొడవు, 76.14 మి.మీ వెడల్పు, 7.68 మి.మీ మందం, 186 గ్రాముల బరువు ఉంటుంది.