120హెర్ట్జ్ డిస్ప్లే, 64ఎంపి కెమెరాతో మలేషియాలో లాంచైన OPPO A98 5G; ధర, స్పెసిఫికేషన్స్

Highlights

  • మలేషియాలో లాంచైన OPPO A98 5G
  • 40ఎక్స్ మైక్రోస్కోపిక్ లెన్స్ తో వచ్చిన డివైజ్
  • 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వచ్చిన హ్యాండ్సెట్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా ఏ-సిరీస్ లో OPPO A98 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ మలేషియాలో లాంచ్ అయ్యింది. ఇదివరకు ఈ ఫోన్ గీక్ బెంచ్, టీడీఆర్ఏ, మలేషియా యొక్క SIRIM సర్టిఫికేషన్ వెబ్ సైట్స్ లో కనిపించింది. ఇటీవలె OPPO A98 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ పోస్టర్ కూడా రివీల్ అయ్యింది. దీంతో స్పెసిఫికేషన్స్ వివరాలు బయటకు వచ్చాయి. తాజాగా మలేషియా మార్కెట్ లోకి ఫోన్ ప్రవేశించింది.

ఇప్పుడు కంపెనీ OPPO A98 5G ని తన వెబ్ సైట్ లో లిస్ట్ చేసింది. ఈ ఫోన్ 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్, 64ఎంపి కెమెరా సెటప్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. సరే, ఓసారి OPPO A98 5G ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

OPPO A98 5G ధర, సేల్ వివరాలు

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ ధరను ఒప్పో సంస్థ లిస్ట్ చేయలేదు. అయితే, OPPO A98 5G డివైజ్ ధర ఈ-కామర్స్ సైట్ లో RM1399 (సుమారు రూ.25,702) గా ఉంది. ఇది 8జిబి + 256జిబి వేరియంట్ ధర.

కంపెనీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ప్రీ-ఆర్డర్స్ తీసుకుంటోంది. అయితే కలర్ ఆప్షన్స్ ఇంకా అఫీషియల్ గా రివీల్ కాలేదు. ఈలోపు ఓ రిపోర్ట్ ద్వారా కలర్ ఆప్షన్స్ వివరాలు తెలిసాయి. డ్రీమీ బ్లూ, కూల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది.

OPPO A98 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

  • ఎల్సీడీ స్క్రీన్
  • 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.

చిప్సెట్, స్టోరేజీ

  • స్నాప్ డ్రాగన్ 695
  • 8జిబి ర్యామ్
  • 256జిబి స్టోరేజీ

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉంది. అలాగే ఈ డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీతో వచ్చింది. ఇంకా ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ ని కలిగి ఉంది.

కెమెరా విభాగం

  • 64ఎంపి రియర్ కెమెరా
  • 32ఎంపి ఫ్రంట్ కెమెరా

OPPO A98 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్

  • 5000ఎంఏహెచ్
  • 67 వాట్

OPPO A98 5G హ్యాండ్సెట్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. పవర్ బటన్ లో ఇది ఎంబెడ్ అయి ఉంటుంది.

ఓఎస్, కస్టమ్ స్కిన్

  • ఆండ్రాయిడ్ 13
  • కలర్ఓఎస్ 13

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

డైమెన్షన్స్, కలర్ ఆప్షన్స్

  • 8.2ఎంఎం
  • 192 గ్రాములు
  • డ్రీమీ బ్లూ, కూల్ బ్లాక్

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ 8.2 మిల్లీ మీటర్ల మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది. ఐపీఎక్స్4 రేటింగ్ తో ఈ ఫోన్ వస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తోంది.