Home News 67వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120హెర్ట్జ్ డిస్ప్లేతో రానున్న OPPO A98 5G; లీకైన స్పెసిఫికేషన్స్ పోస్టర్!

67వాట్ ఫాస్ట్ చార్జింగ్, 120హెర్ట్జ్ డిస్ప్లేతో రానున్న OPPO A98 5G; లీకైన స్పెసిఫికేషన్స్ పోస్టర్!

Highlights
  • ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానున్న డివైజ్
  • తాజాగా లీకైన OPPO A98 5G డివైజ్ స్పెసిఫికేషన్స్ పోస్టర్
  • తొలుత చైనాలో లాంచ్ కానున్న OPPO A98 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో త్వరలోనే ఏ-సిరీస్ లో ఒక 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. OPPO A98 5G పేరుతో రానున్న ఈ డివైజ్ తొలుత చైనా మార్కెట్ లో లాంచ్ కానుంది. రీసెంట్ గా ఈ ఫోన్ CQC, NBTC మరియు SIRIM సర్టిఫికేషన్స్ పై కనిపించింది. ఇక Geekbench లిస్టింగ్ ద్వారా డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితం ఫోన్ రెండర్స్ మరియు స్పెసిఫికేషన్స్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి.

ఇప్పుడు అఫీషియల్ లాంచ్ కి ముందు OPPO A98 5G పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. MySmartPrice ఈ విషయాలను ఎక్స్‌క్లూజివ్ గా తన కథనంలో ప్రచురించింది. పోస్టర్ ఇమేజ్ ద్వారా OPPO A98 5G స్మార్ట్ ఫోన్ డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

OPPO A98 5G పూర్తి స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి.

చిప్సెట్, స్టోరేజీ

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉండనుంది. అలాగే ఈ డివైజ్ 8జిబి ర్యామ్ మరియు 256జిబి స్టోరేజీతో వస్తోంది. ఇంకా ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ ని కలిగి ఉంది.

కెమెరా విభాగం

OPPO A98 5G డివైజ్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్

OPPO A98 5G హ్యాండ్సెట్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. పవర్ బటన్ లో ఇది ఎంబెడ్ అయి ఉంటుంది.

ఓఎస్, కస్టమ్ స్కిన్

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

డైమెన్షన్స్, కలర్ ఆప్షన్స్

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ 8.2 మిల్లీ మీటర్ల మందం, 192 గ్రాముల బరువు ఉంటుంది. ఐపీఎక్స్4 రేటింగ్ తో ఈ ఫోన్ వస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తోంది. OPPO A98 5G డివైజ్ డ్రీమీ బ్లూ మరియు కూల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ తో వస్తోంది.

OPPO A98 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కి సంబంధించిన సమాచారం ఇంతవరకు బయటకు రాలేదు. అయితే ఇప్పటికే చాలా సర్టిఫికేషన్స్ పొందడం వల్లన, రానున్న కొన్ని వారాల్లో డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని అంచనా వేయవచ్చు.