
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా భారత్ లో OPPO F23 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ సరికొత్త ఒప్పో ఫోన్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ మరియు అద్భుతమైన స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉంది. అలాగే స్టైలిష్ లుక్ కూడా ఈ హ్యాండ్సెట్ సొంతం. OPPO F23 5G 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చింది. సరే, ఈ ఫోన్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ధర, లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్ లో OPPO F23 5G ధర
భారత్ లో OPPO F23 5G స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. ఫోన్ ధరను రూ.24,999 గా నిర్ణయించారు. మే 18 నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. బోల్డ్ గోల్డ్, కూల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ కార్డ్స్ పై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
OPPO F23 5G ఫీచర్స్ ఎలా ఉన్నాయి?
- OPPO F23 5G డివైజ్ 13 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. జియో, ఎయిర్టెల్ 5జీ నెట్వర్క్స్ ఈ బ్యాండ్స్ పై రన్ అవుతాయి.
- ఈ ఫోన్ కేవలం 5 నిమిషాలు చార్జింగ్ చేయడం ద్వారా 6 గంటల కాలింగ్ టైమ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
- స్మార్ట్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ ఫీచర్ ద్వారా ఈ డివైజ్ 16జిబి ర్యామ్ ని పొందగలదు.
- మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 1టిబి వరకు మెమొరీని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు.
- ఈ ఫోన్ 40ఎక్స్ మైక్రోలెన్స్ ని కలిగి ఉంది. దీని ద్వారా క్లోజ్ షాట్స్ ని తీయవచ్చు.
- OPPO F23 5G డివైజ్ ఐపీ54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ కలిగి ఉంది.
OPPO F23 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే
- 6.72-పుల్ హెచ్డీ+ స్క్రీన్
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఇంకా 680 నిట్స్ బ్రైట్నెస్, 391 పీపీఐ, ప్యాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి.
ప్రాసెసర్
- 8జిబి ఎక్స్‌స్టెండెడ్ ర్యామ్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఇది 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది. ఈ ఒప్పో ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంది. అలాగే గ్రాఫిక్స్ కోసం ఇందులో అడ్రెనో 619 జీపీయూ వాడారు.
కెమెరా విభాగం
- 32ఎంపి ఫ్రంట్ కెమెరా
- 64ఎంపి రియర్ కెమెరా
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మోనో లెన్స్, 2ఎంపి మైక్రో సెన్సర్ ఉన్నాయి. అలాగే సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్
OPPO F23 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 0 నుంచి 50 శాతం చార్జ్ అయ్యేందుకు కేవలం 18 నిమిషాల సమయం పడుతుందని, అలాగే 0 నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 48 నిమిషాల సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది.
కనెక్టివిటీ
- 5జీ, 4జీ వొల్టీ
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.











