
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ మిడ్-రేంజ్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ వస్తోంది. గత మోడల్ OPPO F21 5G కి ఇది సక్సెసర్ గా వస్తోంది. అతి త్వరలో OPPO F23 5G డివైజ్ భారత్ లో లాంచ్ కానుందని సమాచారం. తాజాగా టిప్‌స్టర్ ముకుల్ శర్మ OPPO F23 5G కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, రెండర్స్, ధర వివరాలను షేర్ చేశారు. ట్విట్టర్ ద్వారా ముకుల్ శర్మ దాదాపు అన్ని డీటెయిల్స్ ని పంచుకున్నారు.
లీకైన వివరాల ప్రకారం, OPPO F23 5G ధర రూ.30,000 గా ఉంటుందని సమాచారం. ఈ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడినట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ ఫాస్ట్ చార్జింగ్, 256జిబి వరకు స్టోరేజీ, 120 హెర్ట్జ్ డిస్ప్లే, మైక్రోలెన్స్ కెమెరా సెటప్ తో వస్తోంది. దీనికి తోడు, మరొక టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ కూడా ఇమేజెస్ ని షేర్ చేశారు. సరే, ఓసారి OPPO F23 5G హ్యాండ్సెట్ వివరాలను తెలుసుకుందాం పదండి.
OPPO F23 5G స్పెసిఫికేషన్స్, ధర (లీక్)
- అమోలెడ్ డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో 6.72-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉంటాయని సమాచారం. ఇతర ర్యామ్ ఆప్షన్స్ లో కూడా ఫోన్ లభించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5జిబి వర్చువల్ ర్యామ్ ఉంది.
- చిప్సెట్
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుందని సమాచారం. ఇది 5జీ చిప్సెట్.
- కెమెరా విభాగం
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మోనోక్రోమ్ లెన్స్, 2ఎంపి మైక్రోలెన్స్ ఉంటాయి. ఈ మైక్రోలెన్స్ కి 40ఎక్స్ జూమ్ సామర్థ్యం ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
- బ్యాటరీ, చార్జింగ్
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే చాన్స్ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది.
- ఓఎస్, వెయిట్
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనుంది.
ఈ డివైజ్ 192 గ్రాముల బరువు, 8.2 మిల్లీ మీటర్ల మందం ఉంటుంది.
- కనెక్టివిటీ
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ సిమ్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉంటాయి.
- ధర (అంచనా)
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ ధర రూ.28,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది బాక్స్ ధర. బాక్స్ ధర కంటే అసలు ధర కాస్త తక్కువగానే ఉండనుంది.
- కలర్ ఆప్షన్స్
OPPO F23 5G స్మార్ట్ ఫోన్ బోల్డ్ గోల్డ్, కూల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.











