ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO తన ఎఫ్ సిరీస్ ఫోన్ OPPO F27 5G ధరను రూ.2,000 తగ్గించింది. ధర తగ్గింపు తర్వాత, ఈ ఫోన్ రూ.20,999 లభించనుంది. ఈ ఫోన్‌ని ఆగస్టు నెలలోనే లాంచ్ చేసింది. అంటే ఒకటిన్నర నెలలు అవుతోంది. అప్పుడే కంపెనీ ఈ ఫోన్ ధరను తగ్గించింది. ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా ఈ విషయం మాకు తెలిసింది. అలాగే, ఆన్‌లైన్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ లో కూడా ఈ ఫోన్ తగ్గింపు ధర లిస్టైంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
OPPO F27 5G ధర రూ.2,000 తగ్గింపు
OPPO F27 5G భారతీయ మార్కెట్ లో రెండు మోడల్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉండగా, రూ.2,000 తగ్గింపు తర్వాత ఇది రూ.20,999 కి లభిస్తోంది.
OPPO F27 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.24,999 కాగా, ధర తగ్గింపు తర్వాత ఇది రూ.22,999 కే లభిస్తోంది.
OPPO F27 5G ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం. ఈ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్ లో రూ.20,999 గా ఉంది. 256జిబి మోడల్ ధర రూ.22,999 గా ఉంది.
ఇంకా 8జిబి+128జిబి మోడల్ పై రూ.12,950 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది. 8జిబి+256జిబి వేరియంట్ పై రూ.14,200 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్, రూ.1210 డిస్కౌంట్ లభిస్తుంది. అన్ని క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై రూ.2,299 డిస్కౌంట్ లభిస్తుంది.
OPPO F27 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: OPPO F27 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆక్వా డైనమిక్స్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 100 పర్సెంట్ డీసీఐ పీ3 కలర్ గ్యామట్, 92.2 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 20:9 యాస్పెక్ట్ రేషియో, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
చిప్సెట్: OPPO F27 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంపీ2 జీపీయూ ఉపయోగించారు.
మెమొరీ: OPPO F27 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. 128జిబి మరియు 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
కెమెరా: OPPO F27 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50డి ప్రైమరీ కెమెరా, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి1బి పొట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంది. ఏఐ స్టూడియో, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.
బ్యాటరీ, చార్జింగ్: OPPO F27 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: OPPO F27 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: OPPO F27 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: OPPO F27 5G లో ఐపీ64 రేటింగ్, 300 పర్సెంట్ అల్ట్రా వాల్యూమ్ మోడల్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
