Home News OPPO F27 5G: రివీలైన ఒప్పో ఎఫ్27 5జీ లైవ్ ఇమేజ్, వచ్చే వారం లాంచ్ అయ్యే అవకాశం

OPPO F27 5G: రివీలైన ఒప్పో ఎఫ్27 5జీ లైవ్ ఇమేజ్, వచ్చే వారం లాంచ్ అయ్యే అవకాశం

Highlights
  • త్వరలో OPPO F27 5G లాంచ్
  • తాజాగా లీకైన డివైజ్ ఇమేజ్
  • 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఎఫ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. OPPO F27 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లైవ్ ఇమేజ్ లీక్ అయ్యింది. 91mobiles కి లైవ్ ఇమేజ్ మరియు స్టోరేజీ ఆప్షన్ వివరాలు లభించాయి. పూర్తి విషయాలు తెలుసుకుందాం పదండి.

OPPO F27 5G లైవ్ ఇమేజ్ (లీక్)

OPPO F27 5G స్మార్ట్‌ఫోన్ లో పంచ్ హోల్ డిస్ప్లే, ఫ్లాట్ ఎడ్జెస్ ఉంటాయని ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.

OPPO F27 5G స్మార్ట్‌ఫోన్ గ్రేడియంట్ కలర్ డిజైన్, మెటల్ ఫ్రేమ్ తో రానుందని అంచనా.

OPPO F27 Pro+ తో పోల్చితే, OPPO F27 5G లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. ప్లస్ వేరియంట్ కర్వ్డ్ డిస్ప్లే, వీగర్ లెదర్ బ్యాక్ కలిగి ఉంది. రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో రెండు లేదా మూడు కెమెరాలు ఉంటాయి. ఇంకా వీటికి తోడు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.

OPPO F27 5G లాంచ్ టైమ్‌లైన్, స్టోరేజీ (లీక్)

లీక్ ప్రకారం, OPPO F27 5G డివైజ్ వచ్చే వారం భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కచ్చితమైన తేదీ తెలియదు. ఇకపోతే, OPPO F27 5G డివైజ్ రెండు వేరియంట్స్ లో లాంచ్ కానుందని సమాచారం. 8జిబి + 128జిబి, 8జిబి + 256జిబి వేరియంట్స్ లో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

OPPO F27 Pro+ 5G స్పెసిఫికేషన్స్

OPPO F27 Pro+ 5G డివైజ్ జూన్ నెలలో లాంచ్ అయ్యింది. ఓసారి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

డిస్ప్లే: OPPO F27 Pro+ 5G లో 6.7-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO F27 Pro+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO F27 Pro+ 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

కెమెరా: OPPO F27 Pro+ 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఒవి64బి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: OPPO F27 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO F27 Pro+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: OPPO F27 Pro+ 5G లో ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది.