ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఎఫ్-సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో OPPO F27 Pro మరియు OPPO F27 Pro+ అనే మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈ సిరీస్ జూన్ లో లాంచ్ కానున్నాయి. జూన్ 13న లాంచ్ ఉంటుందని ఒక పోస్టర్ రివీల్ అయ్యింది. OPPO A3 Pro కి రీబ్రాండ్ వర్షన్‌గా OPPO F27 Pro వస్తోందని సమాచారం.
OPPO F27 Pro Plus 5G గీక్‌బెంచ్, బీఐఎస్ లిస్టింగ్స్
బీఐఎస్ మరియు గీక్‌బెంచ్ లిస్టింగ్స్ ద్వారా మోడల్ నంబర్ తప్పా, మరే ఇతర స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. అయితే, బీఐఎస్ పై లిస్ట్ అవ్వడంతో, త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానుందని అర్థమవుతోంది. త్వరలోనే ఇండియా లాంచ్ వివరాలను ఒప్పో అధికారికంగా ప్రకటించనుంది. లిస్టింగ్ పై OPPO F27 Pro Plus 5G స్మార్ట్‌ఫోన్ CPH2643 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇప్పుడు ఒప్పో ఎఫ్27 సిరీస్ లాంచ్ తేదీ వివరాలను తెలుసుకుందాం.
OPPO F27 సిరీస్ లాంచ్ తేదీ (లీక్)
OPPO F27 సిరీస్ లాంచ్ తేదీని ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పోస్టర్ ప్రకారం, OPPO F27 Pro+ డివైజ్ జూన్ 13న లాంచ్ అవుతుందని తెలుస్తోంది. మరొక మోడల్ OPPO F27 Pro ఇంకా స్టాండర్డ్ వర్షన్ OPPO F27 గురించి ఏ వివరాలు లేవు. బహుశా ఇవి కూడా అదే రోజున లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
OPPO F27 Pro+ బ్లూ మరియు పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. రెండింట్లో లెదర్ బ్యాక్ ప్యానెల్ ఉంది. ప్రో మరియు ప్రో ప్లస్ మోడల్స్ బ్లూ, పింక్ కలర్స్ మరియు లెదర్ బ్యాక్ డిజైన్ తో వస్తాయని అంచనా వేయవచ్చు.
లీకైన ఇమేజ్ లో ఫోన్ వాటర్ లో మునిగి కనిపిస్తోంది. ఈ సిరీస్ ఫోన్లు ఐపీ66, ఐపీ68 మరియు ఐపీ69 సర్టిఫికేషన్స్ తో రానున్నట్లు లీక్ ద్వారా తెలుస్తోంది.
OPPO F27 Pro సిరీస్ లాంచ్ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. లీకైన తేదీ కూడా కచ్చిమైందని చెప్పలేం.
OPPO F25 Pro స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: OPPO F25 Pro 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్ (2412*1080 పిక్సెల్స్), 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, పాండా గ్లాస్, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.
ప్రాసెసర్: OPPO F25 Pro 5G స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ68 జీపీయూ ఉన్నాయి.
ర్యామ్, స్టోరేజీ: OPPO F25 Pro 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
సాఫ్ట్‌వేర్: OPPO F25 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరా: OPPO F25 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఒమ్నివిజన్ ఒవి64బి సెన్సర్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్615 కెమెరా ఉంది.
బ్యాటరీ: OPPO F25 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సెక్యూరిటీ: OPPO F25 Pro 5G లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ65 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.
కనెక్టివిటీ: OPPO F25 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.2, వై-ఫై 6, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, క్యూజీఎస్ఎస్ ఉన్నాయి.
బరువు, చుట్టుకొలత: OPPO F25 Pro 5G డివైజ్ 161.6 మి.మీ పొడవు, 74.7 మి.మీ వెడల్పు, 7.54 మి.మీ మందం ఉంటుంది.
