హైలైట్స్
- Geekbench పై కనిపించిన OPPO Find N2 Flip డివైజ్
- రివీల్ అయిన OPPO Find N2 Flip ప్రధాన స్పెసిఫికేషన్స్
- 12జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్, మాలి జీ710 ఎంసీ10 జీపీయూ తో వస్తోన్న OPPO Find N2 Flip
- గీక్‌బెంచ్ పై సింగిల్ కోర్ టెస్ట్ లో 1306 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 4293 పాయింట్లు సాధించిన OPPO Find N2 Flip
ఒప్పో త్వరలో నిర్వహించనున్న ఇన్నో డే 2022 ఈవెంట్ లో తన ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేయబోతోంది. OPPO Find N2 మరియు OPPO Find N2 Flip ఫోన్లు డిసెంబర్ 15 న లాంచ్ అవుతున్నాయి. అయితే లాంచ్ ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్న తరుణంలో OPPO Find N2 Flip డివైజ్ ప్రముఖ బెంచ్ మార్కింగ్ సైట్ Geekbench పై దర్శనమిచ్చింది. దీంతో ఫోన్ కి సంబంధించిన పలు ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. OPPO PGT110 అనే మోడల్ నంబర్ ని OPPO Find N2 Flip కలిగి ఉంది. ఇక స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం పదండి.
OPPO Find N2 Flip గీక్‌బెంచ్ జాబితా
OPPO Find N2 Flip స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ చిప్సెట్ తో లాంచ్ కానుంది. ఈ చిప్ 3.20 గిగాహెర్ట్జ్ గరిష్ట క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంటుంది. ఇక గ్రాఫిక్స్ కోసం మాలి-జీ710 ఎంసీ10 జీపీయూ వాడారు. ఇక బెంచ్ మార్కింగ్ కోసం ఉపయోగించిన డివైజ్ 12జిబి ర్యామ్ ని కలిగి ఉంది.
OPPO Find N2 Flip డివైజ్ గీక్ బెంచ్ పై సింగిల్ కోర్ టెస్ట్ లో 1306 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 4293 పాయింట్లు సాధించింది. ఓసారి శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 5జీ తో పోల్చి చూద్దాం. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 5జీ సింగిల్ కోర్ టెస్ట్ లో 1293 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 3862 పాయింట్లు సాధించింది.
OPPO Find N2 డివైజెస్ ఒప్పో స్వయంగా అభివృద్ధి పరిచిన కస్టమ్ చిప్, మారిసిలికాన్ ఎక్స్ తో వస్తాయని సదరు కంపెనీ చెబుతోంది. 2023 మొదటి త్రైమాసికంలో ఈ స్మార్ట్ ఫోన్స్ సేల్ కి వస్తాయని రూమర్లు వినిపిస్తున్నాయి.
ఇక గీక్ బెంచ్ ద్వారా రివీల్ అయిన మిగిలిన స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. OPPO Find N2 Flip డివైజ్ 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.2-ఇంచ్ ఓఎల్ఈడీ కవర్ డిస్ప్లే, 4300 బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోంది.
OPPO Find N2 Flip యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. OPPO Find N2 Flip డివైజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.