ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO నేడు చైనాలో OPPO Find N3 Flip అనే ఫోల్డబుల్ ఫోన్ ని లాంచ్ చేసింది. గతంలో వచ్చిన OPPO Find N2 Flip కి ఇది సక్సెసర్ గా వచ్చింది. త్వరలోనే OPPO Find N3 Flip కూడా భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా వచ్చిన OPPO Find N3 Flip డివైజ్ క్లామ్‌షెల్ ఫోల్డింగ్ మెకానిజమ్ తో కూడిన భారీ కవర్ డిస్ప్లేతో వచ్చింది. సరే, ఓసారి OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ ధర, సేల్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
OPPO Find N3 Flip ధర, సేల్ వివరాలు
OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను CNY 6,799 (సుమారు రూ.77,200) గా నిర్ణయించారు. 16జిబి ర్యామ్, 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 7,599 (సుమారు రూ.86,200) గా ఉంది. OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ ని చైనాలో సెప్టెంబర్ 8 నుంచి కొనుగోలు చేయవచ్చు. త్వరలోనే ఈ డివైజ్ గ్లోబల్ గా లాంచ్ కానుందని ఖరారైంది. OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ మూన్‌లైట్ మ్యూజ్, మిస్ట్ రోజ్, మిర్రర్ నైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
OPPO Find N3 Flip స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ లో 6.80-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.26-ఇంచ్ అమోలెడ్ కవర్ స్క్రీన్ ఉన్నాయి.
- చిప్సెట్: OPPO Find N3 Flip డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్ ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ715 ఇమ్మోర్టాలిస్ ఎంపీ11 జీపీయూ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: OPPO Find N3 Flip డివైజ్ లో 16జిబి వరకు ర్యామ్ 512జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి.
- కెమెరా: OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: OPPO Find N3 Flip స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్వేర్: OPPO Find N3 Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: OPPO Find N3 Flip ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్స్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్సీ, 5జీ ఉన్నాయి.
