ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారు OPPO తన స్వదేశం చైనాలో OPPO Find N3 Flip డివైజ్ ని లాంచ్ చేసింది. ఆగస్టు నెలలో ఈ ఫోన్ అక్కడ లాంచ్ అయ్యింది. తర్వాత నుంచి గ్లోబల్ మరియు భారత్ లాంచ్ కి సంబంధించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం గ్లోబల్ వేరియంట్ యొక్క ఫోటో లీకైంది. తాజాగా, OPPO Find N3 Flip డివైజ్ గీక్బెంచ్ పై కనిపించింది. దీంతో ప్రాసెసర్, ఓఎస్ వర్షన్, ర్యామ్ వంటి వివరాలు తెలిసాయి. సరే, ఓసారి OPPO Find N3 Flip డివైజ్ గ్లోబల్ వేరియంట్ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
OPPO Find N3 Flip గీక్బెంచ్ లిస్టింగ్
- OPPO Find N3 Flip డివైజ్ ఒప్పో నుంచి వస్తోన్న కొత్త ఫోల్డబుల్ ఫోన్. బెంచ్ మార్కింగ్ సైట్ గీక్బెంచ్ పై CPH2519 అనే మోడల్ నంబర్ తో కనిపించింది.
- లిస్టింగ్ లో OPPO Find N3 Flip డివైజ్ సింగిల్ కోర్ టెస్ట్ లో 1895 పాయింట్లు, మల్టీకోర్ టెస్ట్ లో 4655 పాయింట్లు సాధించినట్లు తెలుస్తోంది.
- ఫోన్ ప్రాసెసర్ విషయానికి వస్తే, ఈ డివైజ్ 1.80 గిగాహెర్ట్జ్ బేస్ క్లాక్ స్పీడ్, 3.05గిగాహెర్ట్జ్ మ్యాగ్జిమ్ క్లాక్ స్పీడ్ గల చిప్సెట్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
- కంపెనీ OPPO Find N3 Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్ వాడనున్నట్లు సమాచారం.
- OPPO Find N3 Flip డివైజ్ 12జిబి వరకు ర్యామ్ ని ఆఫర్ చేయనుంది. ఇంకా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో లాంచ్ కానుందని తెలుస్తోంది.
OPPO Find N3 Flip స్పెసిఫికేషన్స్ (చైనా)
- స్క్రీన్: OPPO Find N3 Flip లో 6.80-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ ఇన్నర్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3.26-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.
- చిప్సెట్: OPPO Find N3 Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ715 ఇమ్మోర్టాలిస్ ఎంపీ11 జీపీయూ వినియోగించారు.
- మెమొరీ: OPPO Find N3 Flip డివైజ్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది.
- కెమెరా: OPPO Find N3 Flip లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: OPPO Find N3 Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: OPPO Find N3 Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ, ఇతర ఆప్షన్స్: OPPO Find N3 Flip లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, స్టీరియో స్పీకర్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
