
ప్రముఖ టెక్ బ్రాండ్ OPPO భారత్ లో నేడు OPPO Find N3 Flip డివైజ్ ని అఫీషియల్ గా లాంచ్ చేసింది. ఒప్పో నుంచి భారతగడ్డపై లాంచైన రెండో ఫ్లిప్ ఫోన్ OPPO Find N3 Flip. వర్టికల్ కవర్ స్క్రీన్ తో వచ్చిన ఈ డివైజ్ 40 యాప్స్ కి సపోర్ట్ చేయనుంది. అంతేకాదు, భారీ ఇన్నర్ డిస్ప్లేతో పాటు OPPO Find N3 Flip డివైజ్ హాజల్‌బ్లడ్ కెమెరాలు, మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది.
భారత్ లో OPPO Find N3 Flip ధర, సేల్ వివరాలు
- OPPO Find N3 Flip డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.94,999 గా ఉంది.
- అక్టోబర్ 22 వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ మరియు ఒప్పో స్టోర్స్ ద్వారా OPPO Find N3 Flip సేల్ మొదలుకానుంది.
- ఎంపిక చేయబడిన బ్యాంక్స్ ద్వారా నెరిపే లావాదేవీలపై రూ.12,000 క్యాష్‌బ్యాక్ మరియు 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని ఒప్పో ప్రకటించింది. అలాగే వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్, ఇంకా రూ.8,000 వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ లభించనున్నాయి.
- OPPO Find N3 Flip డివైజ్ క్రీమ్ గోల్డ్ మరియు స్లీక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
OPPO Find N3 Flip స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO Find N3 Flip లో 6.8-ఇంచ్ అమోలెడ్ మెయిన్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 3.26-ఇంచ్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.
- ప్రాసెసర్: OPPO Find N3 Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎమ్ ఇమ్మొర్టాలిస్-జీ715 ఎంసీ11 జీపీయూ వాడారు.
- మెమొరీ: OPPO Find N3 Flip డివైజ్ లో 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఉన్నాయి.
- కెమెరా: OPPO Find N3 Flip లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 48ఎంపి సోని ఐఎంఎక్స్581 అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సోని ఐఎంఎక్స్709 ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ, చార్జింగ్: OPPO Find N3 Flip లో పవర్ బ్యాకప్ కోసం 4,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్‌వేర్: OPPO Find N3 Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.2 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: OPPO Find N3 Flip లో 5జీ, డ్యూయల్ సిమ్, డాల్బీ అట్మాస్, వై-ఫై 7, డ్యూయల్ స్పీకర్స్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.











