Home News మార్చి 21 న లాంచ్ కానున్న OPPO Find X6 సిరీస్; ప్రోమో పోస్టర్ ద్వారా రివీలైన డిజైన్

మార్చి 21 న లాంచ్ కానున్న OPPO Find X6 సిరీస్; ప్రోమో పోస్టర్ ద్వారా రివీలైన డిజైన్

Highlights
  • OPPO Find X6 లాంచ్ తేదీని అఫీషియల్ గా ప్రకటించిన కంపెనీ
  • లైనప్ లో భాగంగా రానున్న OPPO Find X6, OPPO Find X6 Pro
  • మార్చి 21 న లాంచ్ కానున్న OPPO Find X6, OPPO Find X6 Pro

OPPO Find X6 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ కి సంబంధించిన రూమర్లు గత కొన్ని రోజులుగా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒప్పో సంస్థ ఈ ప్లాగ్షిప్ సిరీస్ ఫోన్ల లాంచ్ ని ఖరారు చేసింది. 2023 మార్చి 21 న OPPO Find X6 సిరీస్ లాంచ్ కానుందని చైనా సోషల్ మీడియా హ్యాండిల్ పై ఒప్పో ప్రకటించింది. అయితే, గ్లోబల్ లాంచ్ కి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. చైనాతో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఈ సిరీస్ లాంచ్ అవ్వడం ఖాయమని చెప్పవచ్చు.

OPPO Find X6 లైనప్ లో రానున్న ఫోన్లు ఇవే

OPPO Find X6 సిరీస్ త్వరలోనే లాంచ్ కానుంది. ఈ లైనప్ లో OPPO Find X6, OPPO Find X6 Pro డివైజెస్ లాంచ్ కానున్నట్లు ప్రోమో పోస్టర్ మరియు వీడియో ద్వారా తెలిసింది. అలాగే OPPO Find X6 యొక్క డిజైన్ లాంగ్వేజ్ కూడా ప్రోమో పోస్టర్ ద్వారా రివీల్ అయ్యింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

పైన ప్రమోషనల్ పోస్టర్ లో కనిపిస్తోన్న విధంగా, OPPO Find X6 సిరీస్ చైనాలో మార్చి 21 న మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ కానుంది. భారత కాలమాన ప్రకారం, ఉదయం 11.30 గంటలకు ఈ లాంచ్ ఉంటుంది. అయితే ఇది అధికారికంగా ఖరారు కాలేదు. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే OPPO Find X6 సిరీస్ తో పాటు OPPO Pad 2 కూడా లాంచ్ కానున్నట్లు సమాచారం.

OPPO Find X6 Pro విషయానికి వస్తే, 100ఎక్స్ జూమ్ కలిగిన పెరిస్కోప్ కెమెరా పోస్టర్ లో కనిపిస్తోంది. కెమెరా మాడ్యూల్ పై పెద్ద రింగ్ కనిపిస్తోంది. లెదర్ వంటి మెటీరియల్ ని బ్యాక్ ప్యానెల్ కోసం వాడినట్లు అర్థమవుతోంది. అలాగే కెమెరా మాడ్యూల్ కి మధ్యలో హాజెల్‌బ్లడ్ బ్రాండింగ్ కనిపిస్తోంది.

OPPO Find X6 Pro యొక్క కెమెరా సామర్థ్యాలను కూడా ప్రోమో వీడియోలో ఒప్పో టీజ్ చేసింది. OPPO Find X6 Pro డివైజ్ అద్భుతమైన మూన్ షాట్స్ తీయగలదు. ఇంకా షాట్స్ లో ఇతర ఆబ్జెక్ట్స్ కి మరియు హ్యూమన్ ఆబ్జెక్ట్స్ కి సమానమైన అటెన్షన్ ని ఇస్తుంది.

OPPO Find X6 Pro స్పెసిఫికేషన్స్ (లీక్డ్)

OPPO Find X6 Pro స్మార్ట్ ఫోన్ 6.8-ఇంచ్ 2కే 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ ఫోన్ క్వాల్కమ్ టాప్ ఎండ్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో రానున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ ఫోన్ 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

కెమెరా విభాగం విషయానికి వస్తే, OPPO Find X6 Pro లో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉండే అవకాశం ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ డివైజ్ లో 32 ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుందని అంచనా వేస్తున్నారు. పవర్ బ్యాకప్ కోసం ఈ డివైజ్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది. ఇది 100 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం ఈ ఫోన్ లో యూఎస్బీ టైప్-సీ చార్జింగ్ పోర్ట్ ఉండనుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.