OPPO Find X7 సిరీస్ లాంచ్ తేదీ ఖరారు; రివీలైన కలర్ ఆప్షన్స్, ర్యామ్, స్టోరేజీ వేరియంట్స్!

Highlights

  • జనవరి 8న లాంచ్ కానున్న OPPO Find X7
  • Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న Ultra మోడల్
  • 3 కలర్ ఆప్షన్స్ లో లభించనున్న Find X7 సిరీస్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO Find X7 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ చైనా లాంచ్ ని కంపెనీ గత కొన్ని రోజులుగా టీజ్ చేస్తూ వస్తోంది. OPPO Find X7 లైనప్ లో OPPO Find X7 మరియు OPPO Find X7 Ultra అనే మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా ఒప్పో సంస్థ OPPO Find X7 సిరీస్ లాంచ్ తేదీని ప్రకటించింది. జనవరి 8 వ తేదీన చైనాలో OPPO Find X7 సిరీస్ లాంచ్ అవ్వనుంది. సరే, ఓసారి OPPO Find X7 సిరీస్ స్పెసిఫికేషన్స్, లాంచ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Find X7 సిరీస్ లాంచ్ తేదీ

  • OPPO Find X7 సిరీస్ లో రాబోవు OPPO Find X7 Ultra మరియు OPPO Find X7 ఫోన్లు జనవరి 8 వ తేదీన చైనాలో లాంచ్ అవుతున్నాయి.
  • ఈవెంట్‌ని ఒప్పో యొక్క అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ పై మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించవచ్చు.
  • అయితే గ్లోబల్ లాంచ్ ఎప్పుడు ఉంటుందో కంపెనీ వెల్లడించాల్సి ఉంది.

OPPO Find X7 సిరీస్ ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్

  • OPPO Find X7 12జిబి/16జిబి ర్యామ్ మరియు 256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది.
  • OPPO Find X7 డివైజ్ డెజర్ట్ సిల్వర్ మూన్, ద సీ అండ్ ద స్కై, స్మోకీ పర్పుల్ మరియు స్టారీ స్కై బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • OPPO Find X7 Ultra 12జిబి/16జిబి ర్యామ్ మరియు 256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
  • OPPO Find X7 Ultra డివైజ్ ద సీ అండ్ ద స్కై, డెజర్ట్ సిల్వర్ మూన్ మరియు పైన్ షాడో కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO Find X7 సిరీస్ కెమెరా, బ్యాటరీ, డిస్ప్లే, చిప్సెట్ వివరాలు

  • OPPO Find X7 Ultra డ్యూయల్ పెరిస్కోప్ టెలీఫోటో సెన్సర్స్ తో వస్తోంది. OPPO Find X7 సిరీస్ ఫోన్లలో సోని ఎల్‌వైటీ 900 ప్రైమరీ సెన్సర్ ఉంటుందని ఇటీవలె కంపెనీ కన్ఫర్మ్ చేసింది.
  • OPPO Find X7 Ultra, OPPO Find X7 డివైజెస్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు 3సీ సర్టిఫికేషన్ ద్వారా తెలిసింది. అలాగే ఈ ఫోన్లు 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి.
  • OPPO Find X7 సిరీస్ ఫోన్లు శాటిలైట్ కనెక్టివిటీతో వస్తున్నాయని ఒప్పో కంపెనీ కన్ఫర్మ్ చేసింది.
  • మరోవైపు OPPO Find X7 Ultra మాత్రమే శాటిలైట్ కనెక్టివిటీతో వస్తోందని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది.
  • OPPO Find X7 సిరీస్ ఫోన్లలో బీఓఈ ఎక్స్1 ఓరియెంటల్ డిస్ప్లే ఉంటుందని సమాచారం.
  • OPPO Find X7 Ultra డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ ఉంటుంది. OPPO Find X7 లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్ ఉంటుంది.
Previous articleVivo Y28 5G: రూ.13,999 ధరతో భారత్‌లో లాంచైన వివో వై28 5జీ
Next articleపెరిస్కోప్ కెమెరా ఫోన్‌ని టీజ్ చేసిన Realme India
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.