Home News OPPO K10 5G స్మార్ట్‌ఫోన్ పై భారీ డిస్కౌంట్

OPPO K10 5G స్మార్ట్‌ఫోన్ పై భారీ డిస్కౌంట్

హైలైట్స్

ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ లో ఒప్పో స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం OPPO K10 5G పై రూ.2000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, 5జీ కనెక్టివిటీతో వచ్చింది. OPPO K10 5G 8జిబి ర్యామ్ వేరియంట్ ధర ఫ్లిప్ కార్ట్ లో రూ.17,499 గా ఉంది.

OPPO K10 5G బ్యాంక్ ఆఫర్

సిటీ బ్యాంక్ చక్కటి ఆఫర్ ని తీసుకొచ్చింది. OPPO K10 5G కొనుగోలుపై ఈ బ్యాంక్ రూ.1500 డిస్కౌంట్ అందిస్తోంది. అయితే సిటీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా పూర్తి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, మీరు గనుక సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈఎంఐ ద్వారా ఈ ఫోన్ కొంటే మీకు రూ.2000 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్ ధర రూ.15,499 కు తగ్గుతుంది. మీ పాత ఫోన్ ని ఎక్స్‌చేంజ్ చేయడం ద్వారా మరింత డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

OPPO K10 5G స్పెసిఫికేషన్స్

OPPO K10 5G స్మార్ట్ ఫోన్ లో 6.56-ఇంచ్ బెజెల్-లెస్ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్ ఉన్నాయి. డిస్ప్లే ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్ తో తయారైంది. ఇక ఈ స్క్రీన్ 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 810 చిప్సెట్ వాడారు. 8జిబి ర్యామ్, మాలి-జీ57 జీపీయూ గ్రాఫిక్స్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ప్రాక్సిమిటీ సెన్సర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, యాక్సలరోమీటర్, జైరోస్కోప్, ఆంబియంట్ లైట్ సెన్సర్ కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి.

OPPO K10 5G కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరా ఆటో ఫోకస్ సపోర్ట్ తో వస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.

OPPO K10 5G బాక్స్ లో ఏముంటాయి?

OPPO K10 5G బాక్స్ లో హ్యాండ్సెట్, చార్జర్, యూఎస్‌బీ డేటా కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్, సేఫ్టీ గైడ్, క్విక్ గైడ్, ప్రొటెక్టివ్ కేస్ ఉంటాయి. చేతిలో ఇమిడిపోయే, ఆకర్షణీయమైన 5జీ ఫోన్ కోసం చూస్తుంటే OPPO K10 5G ఫోన్ ని ప్రయత్నించండి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.