ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో OPPO K11 5G డివైజ్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ ఫోన్ చైనా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జులై 25 న ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. ఇప్పటికే ఈ ఫోన్ కి సంబంధించిన డిజైన్, ప్రధాన స్పెసిఫికేషన్స్ ని కంపెనీ టీజ్ చేసింది. OPPO K11 5G డివైజ్ ఫ్లాట్ ఫ్రేమ్ డిజైన్ తో వస్తోంది. రియర్ ప్యానెల్ ఫ్లాట్ గా ఉంటుంది. అలాగే కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటాయి. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ లో ఉండనుంది.
OPPO K11 5G చైనాలో రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. స్పెసిఫికేషన్స్, ధర వివరాలు లాంచ్ కి ముందు లీక్ అయ్యాయి. సరే, ఓసారి OPPO K11 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
OPPO K11 5G లాంచ్ వివరాలు
OPPO K11 5G ఒక కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్. ఈ డివైజ్ లో ఫ్లాగ్షిప్ కెమెరా సెన్సర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. OPPO K11 5G లో సోని ఐఎంఎక్స్890 కెమెరా సెన్సర్ ఉంటుందని ఒప్పో రివీల్ చేసింది. ఫ్లాగ్షిప్ డివైజెస్ లో కనిపించే 50ఎంపి ప్రైమరీ కెమెరాని ఈ ఫోన్ లో అందిస్తున్నారు. ఇదే లెన్స్ ని OPPO 11, OPPO Nord 3, OPPO Find X6 Pro, OPPO Reno 10 Pro+ లలో కూడా వాడారు.
ఒప్పో కంపెనీ OPPO K11 5G డిజైన్ ని రివీల్ చేసింది. రియల్ ప్యానెల్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ని కలిగి ఉంది. కెమెరా రింగ్స్ చుట్టూ గ్రేడియంట్ కలర్స్ ఉన్నాయి. పవర్, వాల్యూమ్ బటన్స్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి.
రీసెంట్ గా లాంచ్ అయిన OnePlus Nord CE 3 5G కి ట్వీక్డ్ వర్షన్ గా OPPO K11 5G చైనీస్ మార్కెట్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం. రెండు ఫోన్లలో ఉన్న ఒకే ఒక్క తేడా చార్జింగ్ స్పీడ్. OPPO K11 5G 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తుంటే, Nord CE 3 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్ తో వచ్చింది.
OPPO K11 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO K11 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ కటౌట్ ఉంటాయి.
- కెమెరా: OPPO K11 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రా-వైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించనున్నారు.
- ప్రాసెసర్: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్,
- స్టోరేజీ: OPPO K11 5G లో 12జిబి వరకు ర్యామ్, 256జిబి లేదా 512జిబి స్టోరేజీ ఉంటాయి. ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్3.1 స్టోరేజీ టెక్నాలజీ ఈ ఫోన్ లో అందించనున్నారు.
- ఓఎస్: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తోంది.
- ఇతర ఫీచర్లు: OPPO K11 5G లో 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ స్పీకర్ సెటప్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్ ఉంటాయి. ఈ ఫోన్ 185 గ్రాముల బరువు ఉంటుంది.
OPPO K11 5G ధర
OPPO K11 5G స్మార్ట్ ఫోన్ ధరను ఒప్పో కంపెనీ ఖరారు చేసింది. OPPO K11 5G డివైజ్ చైనీస్ మార్కెట్ లో CNY 2,000 (సుమారు రూ.22,900) ఉంటుంది.
