ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు ఒప్పో జులై 25 న OPPO K11 5G ఫోన్ ని లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ తొలుత చైనాలో లాంచ్ కానుంది. తర్వాత ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. లాంచ్ కి ముందు కంపెనీ OPPO K11 5G స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. OPPO K11 5G డివైజ్ లో ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, 1.07 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంటాయి.
OPPO K11 5G లాంచ్ వివరాలు
OPPO K11 5G స్మార్ట్ ఫోన్ చైనాలో జులై 25 న లాంచ్ అవుతోంది. మధ్యాహ్నం 2.30 గంటలకు, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ అధికార వెబ్ సైట్ ద్వారా ఇండియన్ మొబైల్ యూజర్లు OPPO K11 5G లాంచ్ ని లైవ్ లో చూడవచ్చు.
OPPO K11 5G డిజైన్
OPPO K11 5G స్మార్ట్ ఫోన్ ఫ్లాట్ ప్యానెల్ తో వస్తోంది. పంచ్ హోల్ కటౌట్ డిజైన్ ని ఫోన్ లో అందించారు. బెజెల్స్ సన్నగా ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై భారీ కెమెరా మాడ్యూల్ ఇచ్చారు. ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. ఒప్పో బ్రాండింగ్ తో పాటు, డ్యూయల్ టోన్ కలర్ ఫినిషింగ్ ఇచ్చారు.
OPPO K11 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO K11 5G లో ఓఎల్ఈడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1100 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, 1.07 బిలియన్ కలర్ సపోర్ట్ ఉంటాయి.
- ప్రాసెసర్: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి ప్రాసెసర్ ఉంటుంది.
- స్టోరేజీ: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆఫర్ చేస్తుంది. ఇందులో 8జిబి వర్చువల్ ర్యామ్ ఉంటుంది.
- కెమెరా: OPPO K11 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా ఉంటుంది.
