ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO గతేడాది చైనాలో OPPO K11 ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ గ్లోబల్ గా OPPO Nord CE 3 5G పేరుతో లాంచ్ అయ్యింది. ఇప్పుడు టిప్‌స్టర్ ద్వారా త్వరలో లాంచ్ కాబోవు OPPO K12 కి సంబంధించిన ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలిసాయి. ఈ ఫోన్ గ్లోబల్ గా OPPO Nord CE 4 అనే పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి OPPO K12 వివరాలు తెలుసుకుందాం పదండి.
OPPO K12 ధర, స్పెసిఫికేషన్స్
- OPPO K12 ధరను టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు చైనా సామాజిక మాధ్యమం వీబో ద్వారా రివీల్ చేశారు. OPPO K12 ధర చైనాలో CNY 2,000 గా ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
- గత మోడల్ OPPO K11 8జిబి+256జిబి, 12జిబి+256జిబి మరియు 12జిబి+512జిబి వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.
- వీటి ధరలు వరుసగా CNY 1,899 (సుమారు రూ.22,000), CNY 2,099 (సుమారు రూ.24,270) మరియు CNY 2,499 (సుమారు రూ.28,890) గా ఉన్నాయి.
- OPPO K12 డివైజ్ గ్లోబల్ గా వన్‌ప్లస్ మోడల్ గా గ్లోబల్ గా లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
- గత మోడల్ OPPO K11 గ్లోబల్ గా OnePlus Nord CE 3 5G పేరుతో లాంచైంది.
- దీంతో త్వరలో లాంచ్ కాబోవు OPPO K12 ప్రపంచవ్యాప్తంగా OnePlus Nord CE 4 పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
OPPO K12 స్పెసిఫికేషన్స్ (లీక్)
- ప్రాసెసర్: OPPO K12 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ రివీల్ చేసింది.
- బ్యాటరీ: OPPO K12 డివైజ్ 100 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.
- కెమెరా: OPPO K12 లో ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వివరాలు ఇంకా తెలియదు.
OPPO K11 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 93.4 పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియో, 1100 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్ 10+, 1.07 బిలియన్ కలర్ సపోర్ట్ ఉన్నాయి.
- డిస్ప్లే సపోర్ట్: OPPO K11 5G డివైజ్ ‘లో బ్లూ లైట్ సర్టిఫికేషన్’ పొందింది. ఇంకా ఈ ఫోన్ లో 2160 హై ఫ్రీక్వెన్సీ పీడబ్ల్యఎం డిమ్మింగ్ సపోర్ట్ ఉంది. అలాగే ఆటోమేటిక్ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది.
- ప్రాసెసర్: OPPO K11 5G డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 782జి చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. ఈ చిప్ 2.70 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. OPPO K11 5G డివైజ్ 7,19,702 పాయింట్ల AnTuTu స్కోర్ నమోదు చేసిందని ఒప్పో చెబుతోంది.
- స్టోరేజీ: OPPO K11 5G డివైజ్ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ ని ఆఫర్ చేస్తుంది. అంతే కాదు, ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది.
- కెమెరా: OPPO K11 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ఓఐఎస్ కెమెరాతో పాటు మరో రెండు సెన్సర్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: OPPO K11 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: OPPO K11 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 13.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
