
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో నార్డ్ సిరీస్ ఓ ఒక ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord 4 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్, 50ఎంపి కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో ఈ డివైజ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ డివైజ్ యొక్క లాంచ్ టైమ్‌లైన్ లీక్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.
OnePlus Nord 4 లాంచ్ టైమ్‌లైన్ (లీక్)
OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్ లాంచ్ కోసం వన్‌ప్లస్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫోన్ జులైలో లాంచ్ అవుతుందని Smartprix అనే వెబ్‌సైట్ తన కథనం ద్వారా తెలిపింది. కచ్చితమైన తేదీ వివరాలు ఇంకా తెలియదు. కానీ, జులై మూడోవారంలో, 15వ తేదీన లాంచ్ ఉంటుందని భావిస్తున్నారు. త్వరలోనే వన్‌ప్లస్ నుంచి అధికార ప్రకటన రావొచ్చు.
OnePlus Nord 4 స్పెసిఫికేషన్స్ (లీక్)
స్క్రీన్: OnePlus Nord 4 లో 1.5కే రెజుల్యూషన్ గల డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అమోలెడ్ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.
ప్రాసెసర్: OnePlus Nord 4 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
కెమెరా: OnePlus Nord 4 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇతర సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియదు. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.
బ్యాటరీ: OnePlus Nord 4 లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
OnePlus Nord 4 ధర (అంచనా)
OnePlus Nord 4 డివైజ్ మిడ్-బడ్జెట్ సెగ్మెంట్‌ని ఉద్దేశించి తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ ధర భారత్ లో రూ.28,999 లోపు ఉంటుందని అంచనా వేయడమైంది. టాప్ మెమొరీ వేరియంట్ ధర రూ.34,999 వరకు ఉండవచ్చు. వన్‌ప్లస్ కంపెనీ ఈ ఫోన్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లను అందించే అవకాశం ఉంది. దీంతో ఫోన్ రూ.25,000 కే లభిస్తుంది.











