వచ్చే ఏడాది నుంచి ఫోన్స్ తో చార్జర్ ఇవ్వమని తెలిపిన OPPO

హైలైట్స్:

  • వచ్చే ఏడాది నుంచి కొన్ని ఫోన్లలో చార్జర్ ఇవ్వబోమని స్పష్టం చేసిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో
  • సెపరేట్ గా చార్జర్ ను విక్రయించనున్న ఒప్పో, ఫోన్ మార్చుకున్నప్పటికీ, యూజర్లు అదే చార్జర్ ని వాడుకునే అవకాశం
  • ఏ సెగ్మెంట్ ఫోన్లకు చార్జర్ ఇవ్వబడదో ఇంకా వెల్లడించని ఒప్పో

ఒప్పో రెనో 8 సిరీస్ లాంచ్ ఈవెంట్ లో ఒప్పో ఓవర్సీస్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ బిల్లీ జాంగ్ చార్జర్ కి సంబంధించి ఓ ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి కొన్ని ఫోన్లకు చార్జర్ ఇవ్వబడదని బిల్లీ తెలిపారు. అయితే ఏ సెగ్మెంట్ ఫోన్లకు చార్జర్ ఇవ్వబడదో ఆయన చెప్పలేదు. ఆపిల్, శాంసంగ్ కంపెనీల తర్వాత గ్లోబల్ గా చార్జర్ ని బాక్స్ నుంచి తొలగించిన కంపెనీగా ఒప్పో నిలవబోతోంది. భవిష్యత్తులో ఇతర బ్రాండ్స్ కూడా ఇదే బాటలో పయనించే అవకాశముంది.

వూక్ టెక్నాలజీ ఒప్పో యొక్క చార్జింగ్ సొల్యూషన్. ఇక ఈ కంపెనీ నుంచి ఎప్పటికప్పుడు కొత్త ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ వస్తూనే ఉంటుంది. దీంతో స్పీడ్ కి అనుగుణంగా కొత్త అడాప్టర్లను రూపొందించడం అవసరం. మరి ఈ చార్జర్ల తొలగింపు కేవలం ఎంట్రీ-లెవెల్ ఫోన్లకే పరిమితం అవుతుందా? లేక మిడ్-రేంజ్ ఫోన్లు, ఫ్లాగ్షిప్ ఫోన్లకు కూడా వర్తిస్తుందా అనేది చూడాలి.

బాక్స్ లో OPPO చార్జర్

వచ్చే ఏడాది నుంచి కొన్ని ప్రోడక్ట్స్ బాక్స్ లలో చార్జర్ ని తొలగించనున్నట్లు ఒప్పో తెలిపింది. అయితే ఏయే ఫోన్లకు చార్జర్ ఇవ్వబడదోనన్న విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ఏదేమైనా కొన్ని ఫోన్లకు చార్జర్ మాత్రం వచ్చే ఏడాది నుంచి రాబోదన్నది స్పష్టమైంది. మరి ఒప్పో తీసుకున్న నిర్ణయంపై ఒప్పో బ్రాండ్ లవర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

“మేం వచ్చే ఏడాది నుంచి చాలా ప్రోడక్ట్స్ కి చార్జర్ ని ఇవ్వబోము. మా వద్ద అందుకు ఒక ప్లాన్ ఉంది. సూపర్ వూక్ చార్జర్స్ పొందడం అంత తేలికైన విషయం కాదు, కాబట్టి మేం బాక్స్ లో చార్జర్ ని అందించాం. అయితే, వ్యాపార కార్యాకలాపాలు విస్తృతం చేస్తున్నాం కాబట్టి, బాక్స్ నుంచి చార్జర్ ని తొలగించాలని నిర్ణయించాం. స్టోర్ల ద్వారా చార్జర్ ని కొనుక్కొని యూజర్లు వాడుకోవచ్చు. అలాగే తమ డివైజ్ లను అప్ గ్రేడ్ చేసుకున్నప్పటికీ, చార్జర్స్ ని వాడుకునే అవకాశం ఉంటుంది,” అని ఓ ప్రకటనలో కంపెనీ తెలిపింది.

ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీస్ విషయంలో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఒప్పో కంపెనీ నుంచి తాజాగా వచ్చిన వార్త సంచలనమనే చెప్పాలి. ప్రస్తుతం శాంసంగ్ (45వాట్), ఆపిల్ (20వాట్) కంటే అత్యధిక ఫాస్ట్ చార్జింగ్ స్పీడ్స్ ని అందిస్తోంది ఒప్పో.

ఇటీవలె లాంచ్ అయిన రెనో 8, రెనో 8 ప్రో ఫోన్స్ 80 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తాయి. సమీప భవిష్యత్తులో ఈ ఫోన్లకు ఢోకా లేదని చెప్పాలి. ఇవి బాక్స్ లో చార్జర్ తో వస్తున్నాయి. ఒప్పో డివైజెస్ యూఎస్బీ పవర్ డెలివరీ కి కూడా సపోర్ట్ చేస్తాయి. అయితే వూక్ కంటే పవర్ లెవెల్ తక్కువ ఉంటుంది. కాబట్టి, యూజర్లు మార్కెట్ లో దొరికే థర్డ్-పార్టీ చార్జింగ్ అడాప్టర్లను వాడే అవకాశం ఉంది.

Previous articleRedmi 11 Prime 5G తో పాటు లాంచ్ కానున్న Redmi 11 Prime 4G
Next articleభారత్ లో లాంచ్ అయిన Tata Nexon EV Jet Edition, ధర రూ.17.5 లక్షల నుంచి ప్రారంభం
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.