Home News 50MP Sony IMX890 కెమెరాతో భారత్‌లో లాంచైన OPPO Reno 10 Pro 5G

50MP Sony IMX890 కెమెరాతో భారత్‌లో లాంచైన OPPO Reno 10 Pro 5G

Highlights
  • భారతీయ మార్కెట్ లో లాంచైన OPPO Reno 10 సిరీస్
  • లైనప్ లో భాగంగా ఎంట్రీ ఇచ్చిన 3 స్మార్ట్ ఫోన్లు
  • స్నాప్ డ్రాగన్ 778జి 5జీ ప్రాసెసర్ తో వచ్చిన Reno 10 Pro 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో భారతీయ మార్కెట్ లో OPPO Reno 10 Pro 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో భాగంగా 3 స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ 20జిబి ర్యామ్, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ తో వచ్చింది. ఓసారి, OPPO Reno 10 Pro 5G స్మార్ట్ ఫోన్ డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

OPPO Reno 10 Pro 5G డిజైన్

OPPO Reno 10 Pro 5G స్మార్ట్ ఫోన్ 3డీ కర్వ్డ్ డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ ఎంతో స్లిమ్ గా, తేలికగా ఉంది. బ్యాక్ ప్యానెల్ మెటల్ తో తయారైంది. రియర్ ప్యానెల్ రెండు కలర్స్ లో కనిపిస్తుంది. కెమెరా మాడ్యూల్ విషయానికి వస్తే, ఇందులో భారీ కెమెరా యూనిట్ ఉంది. ఇందులో 3 కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. ఇంకా వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ అందించారు. OPPO Reno 10 Pro 5G ఫోన్ గ్లాసీ పర్పుల్, సిల్వరీ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

OPPO Reno 10 Pro 5G ధర

భారత్ లో OPPO Reno 10 Pro 5G 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.39,999 గా నిర్ణయించారు. జులై 13 నుంచి ఈ ఫోన్ సేల్స్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్ కార్ట్ లో మొదలవుతుంది.

OPPO Reno 10 Pro 5G స్పెసిఫికేషన్స్