Home News లీకైన OPPO Reno 10 Pro+ స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజ్

లీకైన OPPO Reno 10 Pro+ స్పెసిఫికేషన్స్, లైవ్ ఇమేజ్

Highlights
  • నెట్టింట్లో ప్రత్యక్షమైన OPPO Reno 10 Pro+ లైవ్ ఇమేజ్, కలర్ ఆప్షన్
  • స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్ తో వస్తోన్న OPPO Reno 10 Pro+
  • త్వరలోనే లాంచ్ కానున్న OPPO Reno 10 సిరీస్

గతేడాది లాంచైన OPPO Reno 9 సిరీస్ కి సక్సెసర్ గా OPPO Reno 10 సిరీస్ త్వరలోనే చైనాలో లాంచ్ కానుంది. OPPO Reno 10 Pro, OPPO Reno 10 Pro+ డివైజెస్ రీసెంట్ గా బీఐఎస్ సర్టిఫికేషన్ పై కనిపించాయి. తాజాగా OPPO Reno 10 Pro+ ఫోన్ స్పెసిఫికేషన్స్, రియర్ డిజైన్ నెట్టింట్లో లీక్ అయ్యాయి. గతంలో లీకైన 5కే రెండర్స్ తో తాజాగా బయటకు వచ్చిన పిక్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఫోన్ వెనకాల ఓవల్-షేప్ లో ఉన్న కెమెరా మాడ్యూల్, కర్వ్డ్ ఎడ్జెస్ ఉన్నాయి. ఈ ఫోన్ క్రీమ్ కలర్ ఆప్షన్ లో కనిపిస్తుంది.

OPPO Reno 10 Pro+ లైవ్ ఇమేజ్

OPPO Reno 10 Pro+ స్మార్ట్ ఫోన్ లైవ్ ఇమేజ్ ని చూస్తే, ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా బ్యాక్ ప్యానెల్ పై ఓవల్ షేప్ లో కెమెరా మాడ్యూల్ ఉంది. ఈ ఫోన్ టెలీఫోటో లెన్స్ తో వస్తున్నట్లు సమాచారం. ఈ డివైజ్ మెటల్ ఫ్రేమ్ ని కలిగి ఉండనుంది. బాటమ్ లో స్పీకర్ గ్రిల్ ఉంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. అయితే ఫోన్ యొక్క ముందు భాగం కనిపించలేదు. కానీ, పంచ్-హోల్ కటౌట్ ఉంటుందని భావిస్తున్నాం. అలాగే ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.

OPPO Reno 10 Pro+ స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే

OPPO Reno 10 Pro+ స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయని అంచనా.

ప్రాసెసర్, స్టోరేజీ, ర్యామ్

OPPO Reno 10 Pro+ డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ ఉంటుందని గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది. ఇక 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్ మరియు 256జిబి/512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో ఫోన్ లభించనుంది.

ఓఎస్, బ్యాటరీ

OPPO Reno 10 Pro+ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత కలర్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేయనుంది. ఈ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4700 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.

కెమెరా విభాగం

OPPO Reno 10 Pro+ స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 సెకండరీ లెన్స్, 64ఎంపి ఓవీ64బి సెన్సర్ ఉంటాయని సమాచారం. ఇంకా సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఐఎంఎక్స్709 కెమెరా ఉండే అవకాశం ఉంది.

ఇక స్టాండర్డ్ వేరియంట్ అయిన OPPO Reno 10 5G డివైజ్ బీఐఎస్ సర్టిఫికేషన్ పొందింది. ఇది CPH2531 అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఇక ఈ లైనప్ లో వస్తోన్న 3 ఫోన్లు కూడా ఇప్పటికే సింగపూర్ ఐఎండీఏ సర్టిఫికేషన్ పొందాయి. ఈ విషయాన్ని టిప్‌స్టర్ ముకుల్ శర్మ వెల్లడించారు.