
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో వరుసబెట్టి ఫోన్లను లాంచ్ చేస్తోంది. త్వరలో ఈ సంస్థ OPPO Reno 10 సిరీస్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఫోన్ తొలుత చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో పాటు ఇతర మార్కెట్స్ లోకి ప్రవేశించనుంది. తాజాగా ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ వెబ్ సైట్ పై కనిపించింది. ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు 3సీ సర్టిఫికేషన్ ద్వారా రివీల్ అయ్యింది. సరే, ఓసారి OPPO Reno 10 Pro+ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
OPPO Reno 10 Pro+ 3సీ సర్టిఫికేషన్
3సీ సర్టిఫికేషన్ అథారిటీ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ని అవి మార్కెట్ లోకి రాకముందే టెస్ట్ చేసే సంస్థ. ఇది చైనాలో అధికారిక రెగ్యులేటరీ బాడీ గా ఉంది. ఇకపోతే OPPO Reno 10 Pro+ డివైజ్ PHU110 అనే మోడల్ నంబర్ తో 3సీ లిస్టింగ్ పై కనిపించింది. లిస్టింగ్ ద్వారా ఈ ఫోన్ 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ డివైజ్ 5జీ కనెక్టివిటీని కలిగి ఉండనుంది.
OPPO Reno 10 Pro+ స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్ప్లే:
OPPO Reno 10 Pro+ స్మార్ట్ ఫోన్ లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఉండనున్నాయి.
ప్రాసెసర్:
OPPO Reno 10 Pro+ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ తో వచ్చే అవకాశం ఉంది.
ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 10 Pro+ ఫోన్ ని కంపెనీ 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ తో లాంచ్ చేసే చాన్స్ ఉంది.
బ్యాటరీ, చార్జింగ్: ఈ ఫోన్ లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, 100 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ ఉండనున్నాయి.
కెమెరా: ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ డివైజ్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండనుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











