లీకైన OPPO Reno 10 సిరీస్ స్పెసిఫికేషన్స్; Sony IMX890 సెన్సర్‌తో వస్తోన్న Reno 10 Pro+

Highlights

  • నెట్టింట్లో ప్రత్యక్షమైన OPPO Reno 10 సిరీస్ స్పెసిఫికేషన్స్
  • పెరిస్కోప్ కెమెరా సెన్సర్ తో వస్తోన్న OPPO Reno 10 Pro+ 5G
  • 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే తో వస్తోన్న OPPO Reno 10 5G

OPPO సంస్థ రీసెంట్ గా చైనాలో OPPO Reno 9 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో మూడు ఫోన్లను లాంచ్ చేసింది ఒప్పో. వీటిలో రెండు ఈ ఏడాదిలోనే లాంచ్ అవుతాయని రూమర్లు వినిపించాయి. అయితే, తాజాగా తెలిసిన విషయం ఏంటంటే, ఒప్పో సంస్థ భారత్ లో OPPO Reno 9 సిరీస్ ని లాంచ్ చేయడం లేదంట. దాని స్థానంలో 2023 లోనే OPPO Reno 10 సిరీస్ ని లాంచ్ చేయాలని ఒప్పో భావిస్తున్నట్లు సమాచారం.

OPPO Reno 10 సిరీస్ తొలుత చైనాలో లాంచ్ కానుంది. తర్వాత భారత్ తో పాటు గ్లోబల్ గా లాంచ్ అవుతుంది. ఈ లైనప్ లో OPPO Reno 10, OPPO Reno 10 Pro, OPPO Reno 10 Pro+ 5G డివైజెస్ లాంచ్ కానున్నాయి.

2023 ద్వితీయార్థంలో OPPO Reno 10 సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈలోపు OPPO Reno 10 సిరీస్ కి సంబంధించిన ఒక కొత్త నివేదిక బయటకు వచ్చింది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ OPPO Reno 10 సిరీస్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారంతో పాటు స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేసింది. పదండి, ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

లీకైన OPPO Reno 10 సిరీస్ స్పెసిఫికేషన్స్

OPPO 10 Pro+ 5G

స్టాండర్డ్ వేరియంట్ OPPO Reno 10 డివైజ్ 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 2x పొట్రెయిట్ లెన్స్, 32ఎంపి ఫ్రంట్ కెమెరా సెన్సర్, కర్వ్డ్ డిస్ప్లే తో వస్తుందని డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది.

OPPO Reno 10 Pro+ 5G డివైజ్ 1.5కే డిస్ప్లే, 1220*2712 పిక్సెల్స్ రెజుల్యూషన్, 50ఎంపి సోని ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా సెన్సర్ తో వస్తున్నట్లు టిప్‌స్టర్ తెలిపింది. ఇదే కెమెరా సెన్సర్ ని రెనో 9 ప్రో+ 5జీ, వన్‌ప్లస్ 11 మరియు రియల్మీ జీటీ నియో 5 5జీ డివైజెస్ లో వాడారు. OPPO Reno 10 Pro+ 5G డివైజ్ పెరిస్కోప్ కెమెరా తో వస్తున్నట్లు సమాచారం.

OPPO Reno 10 Pro+ 5G స్మార్ట్ ఫోన్ 4600 ఎంఏహెచ్ డ్యూయల్-సెల్ బ్యాటరీ యూనిట్ ఉంటుంది. ఈ ఫోన్ లో 80 వాట్ లేదా 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. OPPO Reno 10 Pro+ 5G యొక్క డిజైన్ రెండర్ కూడా రివీల్ అయ్యింది. దాన్ని చూస్తుంటే, కొత్త కెమెరా మాడ్యూల్ డిజైన్ ని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫోన్ పిల్-షేప్డ్ కెమెరా మాడ్యూల్ తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోంది. త్వరలోనే OPPO Reno 10 సిరీస్ కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleMWC లాంచ్ ఈవెంట్‌ కన్నా ముందే లీకైన Xiaomi 13 Lite 5G ధర
Next article2023 ద్వితీయార్థంలో లాంచ్ కానున్న Samsung Galaxy S23 FE 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.