ప్రముఖ స్మార్ట్‌పోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో OPPO Reno 11 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro డివైజెస్ మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం స్టాండర్డ్ మోడల్ OPPO Reno 11 గురించి తెలుసుకుందాం. OPPO Reno 11 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ పీక్ హెచ్డీఆర్ బ్రైట్నెస్, 10-బిట్ ప్యానెల్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి OPPO Reno 11 ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
OPPO Reno 11 ధర
- OPPO Reno 11 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.29,999 గా ఉంది.
- OPPO Reno 11 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.31,999 గా ఉంది.
- OPPO Reno 11 డివైజ్ రాక్ గ్రే మరియు వేవ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- OPPO Reno 11 డివైజ్ ని ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్ మరియు ఇతర ఆథరైజ్డ్ రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
- OPPO Reno 11 కొనుగోలుపై ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, వన్‌కార్డ్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్ హోల్డర్స్ కి రూ.4,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
- తమ పాత ఒప్పో ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకునే వారికి OPPO Reno 11 పై రూ.4,000 బోనస్ లభిస్తుంది. ఇతర ఫోన్లకు రూ.2,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.
- 9 నెలల వరకు ఎంపిక చేయబడిన క్రెడిట్ కార్డ్స్ పై నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా ఒప్పో అందిస్తోంది.
- OPPO Reno 11 సిరీస్ స్మార్ట్ఫోన్లను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు.
OPPO Reno 11 స్పెసిపికేషన్స్
- డిస్ప్లే: OPPO Reno 11 లో 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్, 2412 * 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 950 నిట్స్ పీక్ హెచ్డీఆర్ పీక్ బ్రైట్నెస్, 10-బిట్ ప్యానెల్, 93% స్క్రీన్ టు బాడీ రేషియో, హెచ్డీఆర్10+ సర్టిఫికేషన్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
- ప్రాసెసర్: OPPO Reno 11 లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి జీ610 జీపీయూ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 11 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
- సాఫ్ట్వేర్: OPPO Reno 11 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కెమెరా: OPPO Reno 11 లో 50ఎంపి సోని ఎల్వైటీ600 1/1.95-ఇంచ్ ఓఐఎస్ మెయిన్ కెమెరా, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 ఆర్జీబీడబ్ల్యూ టెలీఫోటో పొట్రెయిట్ 2x ఆప్టికల్ జూమ్ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ, చార్జింగ్: OPPO Reno 11 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- బరువు, చుట్టుకొలత: OPPO Reno 11 డివైజ్ 162.4 మి.మీ పొడవు, 74.1 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం (రాక్ గ్రే వర్షన్), 8.04 మి.మీ మందం (వేవ్ గ్రీన్ వర్షన్), 182 గ్రాముల బరువు ఉంటుంది.
- సెక్యూరిటీ: OPPO Reno 11 లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ అందించారు.
- ఇతర ఫీచర్లు: OPPO Reno 11 లో 3డీ కర్వ్డ్ గ్లాస్, ట్రిపుల్ లేయర్డ్ గ్లాస్ డిజైన్, శాటిన్ ఫ్రాస్టడ్ స్మూథ్ ఫీల్, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి.
- కలర్ ఆప్షన్స్: OPPO Reno 11 డివైజ్ రాక్ గ్రే మరియు వేవ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
