
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నేడు భారతీయ మార్కెట్ లో OPPO Reno 11 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ లైనప్ లో OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం OPPO Reno 11 Pro గురించి తెలుసుకుందాం. OPPO Reno 11 Pro డివైజ్ 6.7-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లతో వచ్చింది. సరే, ఓసారి OPPO Reno 11 Pro యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
OPPO Reno 11 Pro ధర, కలర్ ఆప్షన్స్, లభ్యత
- OPPO Reno 11 Pro స్మార్ట్‌ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది.
- జనవరి 18 నుంచి OPPO Reno 11 Pro సేల్ రిటైల్ స్టోర్స్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో వెబ్‌సైట్ ద్వారా మొదలవుతాయి.
- ఎస్బీఐ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు వన్ కార్డ్ ద్వారా OPPO Reno 11 Pro కొనుగోలు చేస్తే కస్టమర్లకు రూ.4,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
- ఒప్పో మొబైల్ యూజర్లకు పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ పై ఎక్స్‌ఛేంజ్+లాయాల్టీ బోనస్ రూ.4,000 లభిస్తుంది.
- యూపీఐ పేమెంట్ చేసే వారికి అదనంగా 7.5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది.
- OPPO Reno 11 Pro కొనుగోలు చేసే వారికి, OPPO Enco Air2 Pro ఇయర్‌బడ్స్ రూ.2,999 కే లభిస్తాయి.
OPPO Reno 11 Pro స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: OPPO Reno 11 Pro లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటాయి. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అందించారు.
- ప్రాసెసర్: OPPO Reno 11 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్, మాలి-జీ610 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 11 Pro లో 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ + 256జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, 12జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి.
- కెమెరా: OPPO Reno 11 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్890 ప్రైమరీ కెమెరా, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్709 ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: OPPO Reno 11 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 80 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: OPPO Reno 11 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3, ఐఆర్ బ్లాస్టర్, వై-ఫై 6 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
- ఓఎస్: OPPO Reno 11 Pro ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బరువు, చుట్టుకొలత: OPPO Reno 11 Pro డివైజ్ 162.4 మి.మీ పొడవు, 74.1 మి.మీ వెడల్పు, 7.59 మి.మీ మందం (రాక్ గ్రే), 7.6 మి.మీ మందం (పర్ల్ వైట్), 181 గ్రాముల బరువు ఉంటుంది.











