ప్రముఖ టెక్ బ్రాండ్ Oppo నవంబర్ 23 న చైనాలో Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Oppo Reno 11 Pro, Oppo Reno 11 డివైజెస్ రానున్నాయి. చైనా టెలీకామ్ లిస్టింగ్ ద్వారా Oppo Reno 11 Pro, Oppo Reno 11 డివైజెస్ కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. లిస్టింగ్ ద్వారా స్పెసిఫికేషన్స్, ధర రివీల్ అయ్యాయి. సరే, ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Oppo Reno 11 స్పెసిఫికేషన్స్ (చైనా టెలీకామ్ లిస్టింగ్)
- డిస్ప్లే: Oppo Reno 11 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Oppo Reno 11 లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- ఓఎస్: Oppo Reno 11 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 పై పని చేస్తుంది.
- కెమెరా: Oppo Reno 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్వైటీ-600 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Oppo Reno 11 లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 డివైజ్ 162.36 మి.మీ పొడవు, 73.98 మి.మీ వెడల్పు, 7.62 మి.మీ మందం, 184 గ్రాముల బరువు ఉంటుంది.
Oppo Reno 11 Pro స్పెసిఫికేషన్స్ (చైనా టెలీకామ్ లిస్టింగ్)
- స్క్రీన్: Oppo Reno 11 Pro లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ డిస్ప్లే, 1240*2772 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Oppo Reno 11 Pro లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 Pro లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- ఓఎస్: Oppo Reno 11 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Oppo Reno 11 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Oppo Reno 11 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్వైటీ-700 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 Pro డివైజ్ 161.73 మి.మీ పొడవు, 73.34 మి.మీ వెడల్పు, 8.26 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.
Oppo Reno 11 ధర (చైనా టెలీకామ్ లిస్టింగ్)
- Oppo Reno 11 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 2,799 (సుమారు రూ.32,450) గా ఉంటుంది.
- Oppo Reno 11 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 2,999 (సుమారు రూ.34,750) గా ఉంటుంది.
- Oppo Reno 11 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 3,199 (సుమారు రూ.37,050) ఉంటుంది.
- Oppo Reno 11 డివైజ్ ఒబ్సిడియన్ బ్లాక్, మూన్లైట్ వైట్ మరియు ఫ్లొరైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Oppo Reno 11 Pro ధర (చైనా టెలీకామ్ లిస్టింగ్)
- Oppo Reno 11 Pro 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర CNY 3,999 (సుమారు రూ.46,350) గా ఉంటుంది.
- Oppo Reno 11 Pro 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 4,199 (సుమారు రూ.48,650) గా ఉంటుంది.
- Oppo Reno 11 Pro డివైజ్ ఒబ్సిడియన్ బ్లాక్, మూన్లైట్ వైట్ మరియు టర్కాయిస్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
