ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో భారతీయ మార్కెట్ లో OPPO Reno 11 సిరీస్ ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో రెండు మోడల్స్ లాంచ్ కానున్నాయి. అవి: OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro. ఈ రెండు ఫోన్లు ఇప్పటికే బీఐఎస్, ఎన్బీటీసీ, ఎస్ఐఆర్ఐఎమ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా OPPO Reno 11 సిరీస్ ఇండియా లాంచ్ తేదీ లీక్ అయ్యింది. జనవరి 11న ఈ సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
OPPO Reno 11 సిరీస్ లాంచ్ తేదీ (లీక్)
Exclusive: OPPO Reno11 series could launch in ?? India & global markets on January 11th!
Reno 11 expected to feature Mediatek Dimensity 1080, a slightly different camera bump + 67W SUPERVOOC. Official renders below.
Awaiting info on Reno11 Pro (either Dimensity 8200 or… pic.twitter.com/Ul0fpx6Cnp
— Ishan Agarwal (@ishanagarwal24) December 29, 2023
- ప్రముఖ టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ OPPO Reno 11 సిరీస్ లాంచ్ తేదీని రివీల్ చేశారు.
- అతని ప్రకారం, OPPO Reno 11 సిరీస్ భారత్ తో పాటు గ్లోబల్ మార్కెట్స్ లో 2024 జనవరి 11 న లాంచ్ అవుతోందని తెలుస్తోంది.
- అయితే ఒప్పో నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro డివైజెస్ యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం పదండి.
OPPO Reno 11 స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: Oppo Reno 11 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Oppo Reno 11 లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
- ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- ఓఎస్: Oppo Reno 11 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 పై పని చేస్తుంది.
- కెమెరా: Oppo Reno 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్వైటీ-600 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Oppo Reno 11 లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 డివైజ్ 162.36 మి.మీ పొడవు, 73.98 మి.మీ వెడల్పు, 7.62 మి.మీ మందం, 184 గ్రాముల బరువు ఉంటుంది.
OPPO Reno 11 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
- స్క్రీన్: Oppo Reno 11 Pro లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ డిస్ప్లే, 1240*2772 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Oppo Reno 11 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 లేదా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 Pro లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- ఓఎస్: Oppo Reno 11 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Oppo Reno 11 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Oppo Reno 11 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్వైటీ-700 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 Pro డివైజ్ 161.73 మి.మీ పొడవు, 73.34 మి.మీ వెడల్పు, 8.26 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.
