OPPO Reno 11 సిరీస్ జనవరి 11 వ తేదీన భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ సిరీస్ లో రెండు ఫోన్లు రానున్నాయి. అవి: OPPO Reno 11 మరియు OPPO Reno 11 Pro. ఇప్పటికే ఈ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. అయితే భారత్ లో లాంచ్ కాబోయే డివైజ్ డిజైన్ వేరుగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఒప్పో అధికార వెబ్సైట్ లో కనిపిస్తోన్న డెడికేటెడ్ మైక్రోసైట్ ద్వారా ఈ విషయం తెలిసింది.
OPPO Reno 11 Pro లక్కీ డ్రా
- యూజర్లు జనవరి 1 నుంచి జనవరి 14 వరకు జరిగే లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు.
- డిఫాల్ట్ గా యూజర్లకు రెండు ఛాన్సులు వస్తాయి. సోషల్ మీడియా చానళ్ళలో షేర్ చేస్తే గనుక మరొక ఛాన్స్ పొందే అవకాశం ఉంటుంది.
- మీరు చేయాల్సిందల్లా ఒప్పో అధికార వెబ్సైట్ విజిట్ చేసి, ‘డ్రా నౌ’ అనే బటన్ పై నొక్కాలి. దీంతో మీకు OPPO Reno 11 Pro 5G, OPPO Enco Buds2, 50,000 పాయింట్లు, 30,000 పాయింట్లు, 5,000 పాయింట్లు లేదా రూ.200 డిస్కౌంట్ కూపన్ (దీనిని కనీస కొనుగోలు రూ.1,999 పై పొందవచ్చు). ఈ ప్రమోషనల్ యాక్టివిటీ కొనసాగుతున్నంత వరకు కూపన్ చెల్లుబాటు అవుతుంది.
OPPO Reno 11 సిరీస్ డిజైన్
- OPPO Reno 11 చైనా మోడల్ మాదిరే ఇండియన్ మోడల్ కూడా భారీ రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ కలిగి ఉంటుంది.
- OPPO Reno 11 ఇండియన్ వేరియంట్ లో టాప్ లో ఒక కెమెరా, క్రింద రెండు కెమెరాలు ఉన్నాయి. చైనా వేరియంట్ లో టాప్ కంపార్ట్మెంట్ లో రెండు సెన్సర్స్, బాటమ్ లో ఒక లెన్స్ ఉన్నాయి.
- అయితే, ప్రో మోడల్ లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇంటర్నల్ గా కెమెరా హార్డ్‌వేర్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా అనేది తెలియదు.
- నేచురల్ ఈస్తటిక్ డిజైన్, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ (OPPO Reno 11), 80వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ (OPPO Reno 11 Pro), ఆండ్రాయిడ్ 14 ఆధారిత కలర్ఓఎస్ 14 వంటి ఫీచర్స్ ఒప్పో నుంచి ఇప్పటివరకు రివీల్ అయ్యాయి.
OPPO Reno 11 స్పెసిఫికేషన్స్ (చైనా వేరియంట్)
- డిస్ప్లే: Oppo Reno 11 లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2412 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Oppo Reno 11 లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుందని టిప్‌స్టర్ అంచనా వేశారు.
- ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- ఓఎస్: Oppo Reno 11 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 పై పని చేస్తుంది.
- కెమెరా: Oppo Reno 11 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్వైటీ-600 ప్రైమరీ ఓఐఎస్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Oppo Reno 11 లో పవర్ బ్యాకప్ కోసం 4,800 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 డివైజ్ 162.36 మి.మీ పొడవు, 73.98 మి.మీ వెడల్పు, 7.62 మి.మీ మందం, 184 గ్రాముల బరువు ఉంటుంది.
OPPO Reno 11 Pro స్పెసిఫికేషన్స్ (చైనా)
- స్క్రీన్: Oppo Reno 11 Pro లో 6.74-ఇంచ్ 1.5కే అమోలెడ్ కర్వ్డ్-ఎడ్జ్ డిస్ప్లే, 1240*2772 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Oppo Reno 11 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 లేదా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11 Pro లో 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ ఉంటాయి.
- ఓఎస్: Oppo Reno 11 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- బ్యాటరీ: Oppo Reno 11 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4,700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కెమెరా: Oppo Reno 11 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఎల్వైటీ-700 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బరువు, చుట్టుకొలత: Oppo Reno 11 Pro డివైజ్ 161.73 మి.మీ పొడవు, 73.34 మి.మీ వెడల్పు, 8.26 మి.మీ మందం, 190 గ్రాముల బరువు ఉంటుంది.
