ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo త్వరలో తన తదుపరి రెనో సిరీస్ ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Oppo Reno 11 సిరీస్, Reno 10 సిరీస్ కి సక్సెసర్ గా వస్తోంది. Oppo Reno 11 లైనప్ లో Oppo Reno 11, Reno 11 Pro, Reno 11 Pro Plus డివైజెస్ లాంచ్ కానున్నాయి. Oppo Reno 11 సిరీస్ తో పాటు Vivo, Honor తదితర ఫోన్ల లాంచ్ టైమ్‌లైన్స్ కూడా లేటెస్ట్ రిపోర్ట్ ద్వారా లీక్ అయ్యాయి. సరే, ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Oppo Reno 11 సిరీస్ మరియు ఇతర మొబైల్స్ లాంచ్ టైమ్‌లైన్ (లీక్)
- టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ త్వరలో లాంచ్ కాబోవు Oppo Reno 11 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్ ని చైనీస్ మైక్రో-బ్లాగింగ్ సైట్ వీబోపై షేర్ చేసింది. చైనాలో లాంచ్ అయిన తర్వాత Oppo Reno 11 సిరీస్ భారత్ కి రానుంది.
- Oppo Reno 11 సిరీస్ నవంబర్ ఆఖర్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీకైన ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
- మీకు వివో ఫోన్లు ఇష్టమైతే, త్వరలోనే Vivo S18 సిరీస్ రాబోతోంది. దీని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
- ఇక Honor సంస్థ తన Honor 100 సిరీస్ ని నవంబర్ చివర్లో లాంచ్ చేయనుందని సమాచారం.
- అంతేకాదు, డిసెంబర్ నెలలో Huawei Nova 12 సిరీస్ కూడా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు Oppo Reno 11 సిరీస్ స్పెసిఫికేషన్స్ తెలియలేదు. త్వరలోనే స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈలోపు ఓసారి Oppo Reno 10 5G స్పెసిఫికేషన్స్ ని తెలుసుకుందాం.
Oppo Reno 10 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: OPPO Reno 10 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పంచ్-హోల్ డిస్ప్లే, 2412*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 3డీ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ బ్రైట్నెస్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
- ప్రాసెసర్: OPPO Reno 10 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఆక్టా-కోర్ చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో మాలి-జీ68 జీపీయూ వినియోగించారు.
- రియర్ కెమెరా: OPPO Reno 10 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 32ఎంపి టెలీఫోటో లెన్స్, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి.
- ఫ్రంట్ కెమెరా: OPPO Reno 10 5G లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి సెల్ఫీ కెమెరా ఉంది.
- బ్యాటరీ: OPPO Reno 10 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ 2.0 టెక్నాలజీని కలిగి ఉంది. ఇది కొన్ని నిమిషాల్లోనే బ్యాటరీని పూర్తిగా చార్జ్ చేస్తుందని కంపెనీ చెబుతోంది.
- కనెక్టివిటీ: OPPO Reno 10 5G లో 5జీ, 4జీ, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
