OPPO Reno 11A: IP65 రేటింగ్‌తో జపాన్‌లో లాంచైన రెనో 11ఏ

Highlights

  • జపాన్‌లో OPPO Reno 11A లాంచ్
  • డైమెన్సిటీ 7050 చిప్సెట్
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO రెనో సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది. OPPO Reno 11A పేరుతో వచ్చిన ఈ డివైజ్ జపాన్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. అమోలెడ్ డిస్ప్లే, ఐపీ65 రేటింగ్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 64ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

OPPO Reno 11A ధర, కలర్ ఆప్షన్స్

OPPO Reno 11A స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ మెమొరీ వేరియంట్ లో లాంచ్ అయ్యింది. దీని ధరను 48,800 యెన్స్ (సుమారు రూ.25,000) గా నిర్ణయించారు. జపాన్ లో ఈ ఫోన్ జూన్ 27 నుంచి బుకింగ్ కి అందుబాటులో ఉంటుంది.

OPPO Reno 11A డివైజ్ కోరల్ పర్పుల్ మరియు డార్క్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO Reno 11A స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: OPPO Reno 11A లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 2.5డీ ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ స్క్రీన్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: OPPO Reno 11A లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.6 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో ఏఆర్ఎమ్ మాలి-జీ68 ఎంసీ4 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 11A డివైజ్ లో 8జిబి ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉన్నాయి.

బ్యాటరీ: OPPO Reno 11A లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: OPPO Reno 11A లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

సాఫ్ట్‌వేర్: OPPO Reno 11A డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బరువు, చుట్టుకొలత: OPPO Reno 11A డివైజ్ 162 మి.మీ పొడవు, 75 మి.మీ వెడల్పు, 7.6 మి.మీ మందం, 177 గ్రాముల బరువు ఉంటుంది.

ఇతర ఫీచర్లు: OPPO Reno 11A లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ-సీ పోర్ట్, ఐపీ65 రేటింగ్ ఉన్నాయి.

Previous articleRedmi 13 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు
Next articleOPPO A3 Pro 5G: 45W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో భారత్‌లో లాంచైన ఏ3 ప్రో
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.