
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO ఇటీవలె Reno 11 సిరీస్ లాంచ్ చేసింది. త్వరలో రెనో సిరీస్ లో మరొక ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. OPPO Reno 11F 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తొలుత ఈ ఫోన్ ఇండోనేషియన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తర్వాత ఇతర మార్కెట్స్ లో విడుదలవుతుంది. తాజాగా OPPO Reno 11F 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
లీకైన OPPO Reno 11F 5G స్పెసిఫికేషన్స్
- OPPO Reno 11F 5G కి సంబంధించిన వివరాలను X ఖాతా ద్వారా అన్విన్ అనే టిప్‌స్టర్ షేర్ చేశారు.
- టిప్‌స్టర్ తన పోస్ట్ లో OPPO Reno 11F 5G యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ రివీల్ చేశారు.
- డిజైన్ గురించి మాట్లాడితే, OPPO Reno 11F 5G డివైజ్ ముందువైపు పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
- OPPO Reno 11F 5G డివైజ్ పింక్, గ్రీన్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
Oppo Reno 11F 5G (CPH2603) coming soon to Indonesia
– Dimenisty 7050 (likely)
– 64MP triple camera
– 5,000mAh battery
– 67W fast charging
– Green, pink, blue
– Launch date seems to be February 24It is also BIS-certified, so expected to launch in India, probably as an F-series… pic.twitter.com/8u62bX2JsF
— Anvin (@ZionsAnvin) January 16, 2024
OPPO Reno 11F 5G స్పెసిఫికేషన్స్ (లీక్)
- డిస్ప్లే: OPPO Reno 11F 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, 10-బిట్ కలర్ సపోర్ట్ ఉంటాయి.
- ప్రాసెసర్: OPPO Reno 11F 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: OPPO Reno 11F 5G డివైజ్ 8జిబి ర్యామ్, 6జిబి వర్చువల్ ర్యామ్ 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- కెమెరా: OPPO Reno 11F 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో ఒమ్నివిజన్ ఒవి64బి మెయిన్ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి10 మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: OPPO Reno 11F 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: OPPO Reno 11F 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: OPPO Reno 11F 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్, వై-ఫై, ఐపీ65 రేటింగ్ ఉంటాయి.
రానున్న రోజుల్లో OPPO Reno 11F 5G కి సంబంధించిన ఇతర మార్కెట్స్ లాంచ్ వివరాలతో పాటు, భారత మార్కెట్ లాంచ్ వివరాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉంది.











