OPPO: గీక్‌బెంచ్‌పై లిస్టైన Reno 11F 5G

Highlights

  • త్వరలో లాంచ్ కానున్న OPPO Reno 11F 5G
  • గీక్‌బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్
  • డైమెన్సిటీ 7050 చిప్సెట్‌తో వస్తోన్న డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో Reno 11F 5G స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ డివైజ్ కంపెనీ గ్లోబల్ వెబ్‌సైట్ లో లిస్టైంది. తాజాగా, బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా OPPO Reno 11F 5G యొక్క స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. భారత్ లో OPPO Reno 11F 5G డివైజ్ OPPO F25 పేరుతో లాంచ్ కానుందని సమాచారం. సరే, ఓసారి గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Reno 11F 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

  • OPPO Reno 11F 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై CPH2603 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • OPPO Reno 11F 5G డివైజ్ సింగిల్ కోర్ టెస్ట్ లో 897 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2329 పాయింట్లు స్కోర్ చేసింది.
  • OPPO Reno 11F 5G ఫోన్ 8జిబి ర్యామ్ తో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • OPPO Reno 11F 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్, మాలి-జీ68 ఎంసీ4 జీపీయూ ఉంటాయి.
  • OPPO Reno 11F 5G డివైజ్ గీక్‌బెంచ్ పై ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

OPPO Reno 11F 5G లాంచ్ తేదీ, ధర

  • OPPO Reno 11F 5G స్మార్ట్‌ఫోన్ 2024 ఫిబ్రవరి 24 న లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
  • OPPO Reno 11F 5G ధర రూ.29,999 ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • OPPO Reno 11F 5G 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది.

OPPO Reno 11F 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Oppo Reno 11F 5G లో 6.7-ఇంచ్ అమోలెడ్ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్, 10-బిట్ కలర్ సపోర్ట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Oppo Reno 11F 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Oppo Reno 11F 5G డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ, 6జిబి వర్చువల్ ర్యామ్ తో వస్తోంది.
  • కెమెరా: Oppo Reno 11F 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి. కెమెరా మాడ్యూల్ లో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి10 మ్యాక్రో కెమెరా ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Oppo Reno 11F 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Oppo Reno 11F 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Oppo Reno 11F 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, ఐపీ67 రేటింగ్ ఉంటాయి.